ఘనంగా సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవం

అమెరికాలోని కెంటకీలో సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది.

Published : 10 Jan 2023 22:38 IST


లూయిస్విల్లే: అమెరికాలోని కెంటకీలో సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. సిలికానాంధ్ర సమన్వయకర్త రమణ భావరాజు, ప్రధానోపాధ్యాయుడు సుధాకర్‌ రావు వెల్ది ఆధ్వర్యంలో స్నాతకోత్సవం నిర్వహించారు. సభాధ్యక్షుడు పూర్ణ భాస్కర్, మనబడి ఉపాధ్యక్షులు శ్రీదేవి గంటి, శోభ బొడ్డులూరి, ప్రాంతీయ సమన్వయకర్త కిరణ్ పారిపూడి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభాసం, ప్రకాశం విద్యార్థులకు ఈ సందర్భంగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. సరస్వతి తూటుపల్లి ఆధ్వర్యంలో చిన్నారుల నృత్య ప్రదర్శన, నాటక కళారూపాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సరస్వతీ వందన సమర్పణతో స్నాతకోత్సవం ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని