TANA: తానా మహాసభల్లో ‘చిత్ర’ గానం
తానా మహాసభలకు ప్రముఖ నేపథ్య గాయిని ‘చిత్ర’ హాజరు కానున్నారు. ఈ మేరకు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు.
ఫిలడెల్ఫియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. జులై 7 నుంచి 9 వరకు జరగనున్న ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు. సినీ సంగీత విభావరులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రముఖ నేపథ్య గాయని కె.ఎస్. చిత్ర తానా మహాసభలకు హాజరుకానున్నారు. తెలుగు సినిమాల్లో ఎన్నో పాటలు పాడిన ‘చిత్ర’ రాక.. సినీప్రియులకు ఆనందాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. మీరు కూడా తానా మహాసభల్లో ‘చిత్ర’ గానాన్ని వినాలనుకుంటున్నారా? అయితే, https://tanaconference.org/event-registration.html ద్వారా మహాసభలకోసం మీ పేర్లను రిజిష్టర్ చేసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత
-
IND vs AUS: ఆసీస్‌పై ఆల్‌రౌండ్ షో.. టీమ్ఇండియా ఘన విజయం
-
Bennu: నాసా ఘనత.. భూమి మీదికి గ్రహశకలం నమూనాలు!