Canada: ‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

‘తెలుగు అలయన్స్‌ ఆఫ్‌ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు.

Published : 22 Apr 2024 00:15 IST

టొరంటో: ‘తెలుగు అలయన్స్‌ ఆఫ్‌ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీ శృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామనవమి వేడుకలను శనివారం(ఏప్రిల్ 20న)భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పురోహితుడు మంజునాథ్ ఆధ్వర్యంలో పలువురు వేద పండితులు, పురోహితులు శాస్త్రోక్తంగా శ్రీరాముని కల్యాణం జరిపించారు. అనంతరం కల్యాణంలో పాల్గొన్న భక్తులకు భద్రాచలం నుంచి తెప్పించిన వెండి నాణేలు, లడ్డూలను తాంబూలంతో పాటు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 1200 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

వేడుకల్లో ‘తెలుగు అలయన్స్‌ ఆఫ్‌ కెనడా’ (తాకా) అధ్యక్షుడు రమేశ్ మునుకుంట్ల, ఉపాధ్యక్షుడు రాఘవ్ అల్లం, ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జునాచారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ, డైరెక్టర్లు కుమారి విద్య భవణం, ఖజిల్ మొహమ్మద్, దుర్గా ఆదిత్య వర్మ భూపతిరాజు, యూత్ డైరెక్టర్‌ లిఖిత యార్లగడ్డ, ఎక్స్ అఫిషియో సభ్యురాలు కల్పన మోటూరి, ఫౌండేషన్ కమిటీ ఛైర్మన్‌ అరుణ్ కుమార్ లాయం, ట్రస్టీబోర్డు ఛైర్మన్ సురేశ్ కూన, ట్రస్టీలు శృతి ఏలూరి, వాణీ జయంతి, పవన్ బాసని, ఫౌండర్లు హనుమంతాచారి సామంతపూడి, శ్రీనాథ్ కుందూరి, మునాఫ్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని