‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ ఆధ్వర్యంలో సింగపూర్‌లో ఉత్సాహంగా మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్
‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ ఆధ్వర్యంలో మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్ సింగపూర్‌లో ఉత్సాహంగా జరిగింది. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేకమంది కార్మికులు తరలివచ్చి సందడి చేశారు.
సింగపూర్: గత రెండేళ్లుగా వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలతో అభిమానాన్ని సంపాదించుకున్న "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ తొలిసారి సింగపూర్‌లో క్రీడారంగంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండగ సందర్భంగా మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్ (MFCL)ను టెరుసన్ రిక్రియేషన్ సెంటర్‌లో ఈ నెల 22 నుంచి 24వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సింగపూర్ నలుమూలల నివసించే కార్మిక సోదరులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ లీగ్‌లో మొత్తం 12 జట్లు లెవన్ టైగెర్స్, విక్టోరియన్స్ (మెగాయార్డ్), కూల్ ట్రంప్స్ (పెంజూరు), సెంబావాన్గ్ స్ట్రైకర్స్ (సెంబావాన్గ్), కెప్పెల్ సన్‌రైజర్స్ (అకాసియా లాడ్జ్), సింగపూర్ తెలంగాణ (వెస్ట్ కోస్ట్), కెన్టెక్ హాన్టెర్స్ (కెన్టెక్ లాడ్జి), రాయల్ గైస్ (కాకిబుకిత్), తెలుగు సూపర్ కింగ్స్ (సీడీపీల్/జేటీసీ), దుర్గ ఎలెవెన్స్ (జురాన్గ్ ఐలాండ్), రోటరీ కోబ్రాస్ (TR), ట్రోఫీ ఫైటర్స్ ( Tuas View) తలపడ్డాయి. హోరాహోరీగా కొనసాగిన ఈ టోర్నమెంట్‌లో ముత్యాల రమేష్ సారథ్యంలోని కూల్ ట్రంప్స్ (పెంజూరు) జట్టు విజేతగా నిలవగా.. చిన్నబోయిన రవి కుమార్ సారథ్యంలోని దుర్గ ఎలెవెన్స్ (జురాన్గ్ ఐలాండ్) జట్టు ద్వితీయ, సంకాబత్తుల దుర్గ బాబు సారథ్యంలోని రాయల్ గైస్ (కాకిబుకిత్) టీమ్ మూడో స్థానంలో నిలిచింది. తొలి బహుమతిగా 500 డాలర్లు; ద్వితీయ, తృతీయ బహుమతులుగా వరుసగా 300 డాలర్లు; 200 డాలర్లను విజేతలకు నిర్వాహకులు అందజేశారు. సీడీ దిలీప్ వరప్రసాద్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ట్రోఫీ అందుకోగా, బెస్ట్ బౌలర్‌గా మహేశ్వరన్ సూర్య ప్రకాష్, బెస్ట్ క్యాచ్‌కు పందాల జైరాం నాయుడు ఎంపికయ్యారు. ఈ టోర్నమెంట్‌కు అంపైర్లుగా శ్రీనివాస్ యాదవ్, సంగటి చంద్ర మోహన్ రెడ్డి వ్యవహరించారు.
గిరిధర్ సారాయి నేతృత్వంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యాక్రమంలో నగేష్ టేకూరి, పోతగౌని నర్సింహా గౌడ్, అశోక్ ముండ్రు, కంకిపాటి శశిధర్ , సుదర్శన్ పూల, రాము చామిరాజు, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, శ్రీధర్ భరద్వాజ్, సునీల్ రామినేని, కరుణాకర్ కంచేటి , మిట్టా ద్వారకానాథ్, తోట సహదేవుడు, ఎస్ కుమార్, లీల మోహన్, సురేంద్ర చేబ్రోలు తదితరులతో పాటు అనేక మంది వాలంటీర్లుగా పాల్గొన్నారు. వీరితో పాటు తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు రమేష్ గడప, ఆ సొసైటీ సభ్యులు నీలం మహేందర్, గారెపల్లి శ్రీనివాస్, కొల్లా శివప్రసాద్ తదితరులు విచ్చేసి నిర్వాహుకులు, క్రీడాకారులను అభినందించారు. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి సహకరించిన వ్యక్తులు, సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: 175 స్థానాల్లో వైకాపాను ఓడించడమే లక్ష్యం: చంద్రబాబు
-
India News
Navjot Singh Sidhu: జైలునుంచి విడుదలైన సిద్ధూ.. రాహుల్ గాంధీ ఓ విప్లవమని వ్యాఖ్య!
-
Movies News
అల్లు అర్జున్‌తో మురుగదాస్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు
-
Sports News
LSG vs DC: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ X దిల్లీ క్యాపిటల్స్.. బోణీ కొట్టే జట్టేది?
-
General News
SRH vs RR: ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సంఖ్య పెంపు