ప్ర‌వాసుల కోసం ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్రారంభం

ప్రవాస భారతీయుల కోసం రూపొందించిన ‘స్వదేశం’ (swadesam) సేవలు ప్రారంభమయ్యాయి.

Published : 09 Jan 2023 23:58 IST

హైదరాబాద్‌: ప్రవాస భారతీయుల కోసం రూపొందించిన ‘స్వదేశం’ (swadesam) సేవలు ప్రారంభమయ్యాయి. ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మ‌హారాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్ చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్ రావు ‘స్వదేశం’ (www.swadesam.com) వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఐలకు భారత్‌ నుంచి సేవ‌లు అందించేందుకు ఈ వెబ్‌సైట్‌ వార‌ధిగా మారడం అభినంద‌నీయ‌మ‌న్నారు. ప్ర‌వాస భార‌తీయుల‌కు నాణ్య‌మైన సేవ‌లు అందించాల‌ని సూచించారు. ఈ సందర్భంగా ‘స్వదేశం’ టీమ్‌ను అభినందించారు. ఎన్‌ఆర్‌ఐలు ప్రపంచవ్యాప్తంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. అన్ని రంగాల్లోనూ ప్రవాస భారతీయులు రాణిస్తున్నారన్నారు. 

అనంత‌రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప‌లువురు ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు. ఇండియా నుంచి త‌మ‌కు కావాల్సిన సేవ‌ల‌ను అందించేందుకు ‘స్వదేశం’ ప్రారంభ‌మ‌వడంపై వారు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, ఎన్ఆర్‌ఐ వేణు న‌క్ష‌త్రం, ‘మీడియాబాస్’ సీఈవో స్వామి ముద్దం, ‘స్వ‌దేశం’ డైరెక్ట‌ర్ స్వాతి దేవినేని, అవంతిక‌, ప్ర‌వీణ్ దొడ్డ‌, అశోక్ ద‌య్యాల‌, బైరి వెంక‌టేశం, రాయ‌ల ల‌క్ష్మీన‌ర్స‌య్య, వికాశ్, సునీల్, ఎమ్‌ఎన్‌ఆర్‌ గుప్తా, ప్ర‌భాక‌ర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు