TANA: తానాలో కీలక కమిటీలకు ఛైర్‌పర్సన్‌ల నియామకం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్‌ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.

Published : 26 Apr 2024 17:26 IST

వాషింగ్టన్‌: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్‌ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తానా కార్యదర్శి రాజా కసుకుర్తి వెల్లడించారు. తానాలో ముఖ్యమైన టీమ్‌ స్క్వేర్‌ కమిటీకి ఛైర్‌ పర్సన్‌గా కిరణ్‌ కొత్తపల్లిని నియమించగా.. తానా పత్రికకు సాయి బ్రహ్మానందం గొర్తి, వెబ్‌ కమిటీకి బిల్హన్‌ ఆలపాటిని ఛైర్‌పర్సన్లుగా నియమించినట్లు తెలిపారు. అలాగే,  తానా కళాశాల ఛైర్‌పర్సన్‌గా మాలతి నాగభైరవ, తానా పాఠశాల ఛైర్‌పర్సన్‌గా భాను మాగులూరి, మెంబర్‌షిప్‌ వెరిఫికేషన్‌ కమిటీ సభ్యులుగా సుధీర్‌ చింతమనేని, శ్రీనివాస్‌ వల్లూరిపల్లిని నియమించామని రాజా కసుకుర్తి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని