తానా ఎన్నిక కథ సుఖాంతం.. కొత్త సభ్యుల ఎన్నికకు బోర్డు ఆమోదం

మార్చి 1 నుంచి కొత్త బోర్డు, పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రస్తుత తానా బోర్డు ఛైర్మన్‌ హనుమయ్య బండ్ల తెలిపారు.

Published : 01 Mar 2024 18:45 IST

అమెరికా: తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో తానా ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులను తోసిపుచ్చుతూ, కొత్తగా ఎన్నికైన బోర్డు సభ్యులు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుల నియామకాలకు ఆమోదముద్ర లభించింది. మార్చి 1 నుంచి కొత్త బోర్డు, పాలకవర్గం సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రస్తుత తానా బోర్డు ఛైర్మన్‌ హనుమయ్య బండ్ల తెలిపారు. ఈమేరకు సభ్యులకు పంపిన లేఖలో ఈ విషయాన్ని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో ఎన్నికల ఓటింగ్‌ పై వచ్చిన ఫిర్యాదులపై చర్చించి వాటిని తోసిపుచ్చడంతోపాటు, ఎన్నికల కమిటీ పంపిన ఫలితాలను పరిగణనలోకి తీసుకొంటూ, కొత్తగా ఎన్నికైన సభ్యుల ఎన్నికకు అధికారికంగా బోర్డ్‌ ఆమోదముద్ర వేసినట్లు హనుమయ్య బండ్ల తాను పంపిన లేఖలో తెలిపారు. బోర్డు ఆమోదం తెలపడంతో ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా నరేన్‌ కొడాలితోపాటు ఆయన టీమ్‌ బాధ్యతలను చేపట్టినట్లయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు