NRI: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తానా బోర్డు సభ్యుడి భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరగింది. ఈ దుర్ఘటనలో తానా బోర్డు సభ్యుడు నాగేంద్ర శ్రీనివాస్‌ భార్య

Updated : 27 Sep 2022 12:30 IST

పామర్రు రూరల్‌: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్సాస్‌లోని వాలర్‌ కౌంటీ వద్ద జరిగిన ఈ ఘటనలో తానా బోర్డు సభ్యుడు డాక్టర్‌ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌ భార్య వాణిశ్రీ, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. శ్రీనివాస్‌ భార్య తమ కుమార్తెలను కళాశాల నుంచి తీసుకొస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారును ఓ వ్యాను బలంగా ఢీకొట్టింది. దీంతో ఘటనాస్థలంలోనే ఇద్దరు చనిపోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.  

కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన నాగేంద్ర శ్రీనివాస్‌.. ఉన్నత విద్యను అభ్యసించేందుకు 1995లో అమెరికా వెళ్లారు. అక్కడ హ్యూస్టన్‌లో వైద్యుడిగా స్థిరపడ్డారు. 2017 నుంచి తానా బోర్డులో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన భార్య వాణిశ్రీ ఐటీ ఉద్యోగి కాగా.. పెద్ద కుమార్తె వైద్య విద్యను, రెండో కుమార్తె 11వ తరగతి చదువుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్యాపిల్లలను కోల్పోవడంతో శ్రీనివాస్ ప్రస్తుతం షాక్‌లో ఉన్నారు. ఆయన తండ్రి కొడాలి రామ్మోహన్ రావు గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి విజయవాడలో స్థిరపడినట్లు స్థానికులు చెబుతున్నారు. శ్రీనివాస్‌ భార్య, కుమార్తెల మృతిపట్ల తానా సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని