TANA: ఫిలడెల్ఫియాలో ఘనంగా తానా వనభోజనాలు

అమెరికాలోని పెన్సిల్వేనియాలో లాభాపేక్షలేని తానా (TANA) తెలుగు ప్రజలకు వనభోజనాలు ఏర్పాటు చేసింది. ఓక్స్ నగరంలోని లోయర్ పెర్కియోమెన్ వ్యాలీ పార్కులో.........

Updated : 24 Nov 2022 14:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలోని పెన్సిల్వేనియాలో తానా (TANA) ఆధ్వర్యంలో తెలుగు ప్రజలకు వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఓక్స్ నగరం లోయర్ పెర్కియోమెన్ వ్యాలీ పార్కులో సెప్టెంబర్ 25న మిడ్ అట్లాంటిక్ తానా బృందం వనభోజనాలు, ఆత్మీయ కలయికతోపాటు పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఫిలడెల్ఫియా‌ నగర పరిధిలోని సుమారు 800 మంది తెలుగువారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించారు. 

ఈ వనభోజనాల కార్యక్రమానికి న్యూజెర్సీ, డెలావేర్ నుంచి కూడా తెలుగు ప్రజలు హాజరయ్యారు. టెక్సాస్ నుంచి నాగరాజు నలజుల, వర్జీనియా నుంచి బాబీ యెర్ర, ఫ్లోరిడా నుంచి సాయి జరుగుల ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వచ్చారు. ఈ సందర్భంగా తానా మిడ్ అట్లాంటిక్ కోఆర్డినేటర్ సునీల్ కోగంటి మాట్లాడుతూ.. అధ్యక్షుడు అంజయ్య చౌదరి, మహాసభల కోఆర్డినేటర్ పొట్లూరి రవి నేతృత్వంలో 23వ తానా మహాసభలు 2023 జులై 7 నుంచి 9 వరకు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

తానా లీడర్‌షిప్‌ టీం నుంచి ఈ కార్యక్రమంలో సునీల్ కోగంటి, రాజా కసుకుర్తి, విద్య గారపాటి, శ్రీనివాస్ ఓరుగంటి, తానా 23వ మహాసభల కోఆర్డినేటర్ పొట్లూరి రవి, పాఠశాల చైర్ నాగరాజు నలజుల, టీం స్క్వేర్ కోచైర్ కిరణ్ కొత్తపల్లి తదితరులు పాల్గొన్నారు. విశ్వనాధ్ కోగంటి, హరనాథ్ దొడ్డపనేని, లీలా కృష్ణ దావులూరి, శ్రీనివాస్ భారతవరపు, సుధాకర్ కంద్యాల, కృష్ణ నందమూరి, రాహుల్ యెర్ర, సాయి జరుగుల, రత్న మూల్పూరి, మూర్తి నూతనపాటి, రవి ఇంద్రకంటి, పవన్ నడింపల్లి, హరీష్ అన్నాబత్తిన, ప్రవీణ్ ఇరుకులపాటి, సురేష్ కంకణాల, శ్రీధర్ సాదినేని, శ్రవణ్ లంక, గౌరీ కర్రోతు, సతీష్ నల్లా, సౌజన్య ఉన్నవ తదితరులు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు.

యూత్ వాలంటీర్ మన్విత యాగంటి, తానా ఫిలడెల్ఫియా ఉమెన్స్ టీం కోఆర్డినేట్‌ర్‌ క్రీడలను నిర్వహించారు. భూమి కాఫీ ప్రొప్రైటర్ పాపారావు ఉండవల్లి, తానా మిడ్ అట్లాంటిక్ కార్యక్రమాలకు సహకరిస్తున్న స్ప్రూస్ ఇన్ఫోటెక్ వేణు సంగానికి ఈ సందర్భంగా తానా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. రవి పొట్లూరి, సునీల్ కోగంటి, రవి మందలపు, కిరణ్ కొత్తపల్లి, సతీష్ తుమ్మల, హరి మోటుపల్లి, రఘు ఎద్దులపల్లి, హరనాథ్ దొడ్డపనేని, హరి మోటుపల్లి, సాంబయ్య కోటపాటి, ఫణి కంతేటి, రంజిత్ మామిడి, చలం పావులూరి, రామ ముద్దన, కోటిబాబు యాగంటి, మోహన్ మల్ల, వంశి నలజాల, అను తుమ్మల, రవి తేజ ముత్తు, లీల కృష్ణ దావులూరి, సుధాకర్ కంద్యాల, ఇందు సందడి, సరోజ యాగంటి, రాజేశ్వరి కోడలి, స్వరూప కోటపాటి, కవిత మందలపు, రూప ముద్దన, లక్ష్మి అద్దంకి, కవిత చిడిపోతు, లక్ష్మి అడ్డంకి, భవాని మామిడి, విజయశ్రీ పరుచూరి, మనీషా మేకా, నాయుడమ్మ యలవర్తి, భాస్కర్ దొప్పలపూడి తదితరులు ఈ కార్యక్రమానికి తమవంతు సహకారం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని