TANA: తానా మహాసభలు.. ఎంపీ జోగినపల్లికి ఆహ్వానం

అమెరికాలో జులై 7 నుంచి 9 వరకు ‘తానా’ మహాసభలు జరగనున్నాయి. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో అట్టహాసంగా వీటిని నిర్వహించనున్నారు.

Published : 28 Apr 2023 09:46 IST

హైదరాబాద్‌: అమెరికాలో జులై 7 నుంచి 9 వరకు ‘తానా’ మహాసభలు జరగనున్నాయి. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో అట్టహాసంగా వీటిని నిర్వహించనున్నారు. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు రావాలంటూ భారాస ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను తానా ప్రతినిధులు ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఎంపీని కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. దానితో పాటు ఆహ్వానం పలుకుతూ తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి రాసిన లేఖను అందించారు. ఈ సందర్భంగా ఎంపీ జోగినపల్లి ట్వీట్‌ చేస్తూ తనకు ఆహ్వానం పలికిన తానా సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. వారితో వివిధ అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని