NRI: విద్యార్థులకు సైన్స్ పరికరాలు, స్టడీ మెటీరియల్ అందించిన తానా మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి
కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడానికి కృషి చేస్తామని తానా మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి తెలిపారు. పాఠశాల విద్యార్థులను ఎన్నారై విద్యార్థులతో ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసి ఆధునిక సాంకేతిక విద్యను బోధించడానికి కృషి చేస్తామన్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సహకారంతో కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల ఉన్నత పాఠశాల విద్యార్థులకు మైక్రోస్కోప్ పరికరాలు, పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. విద్యార్థులకు బోధనా పరికరాలు, కంప్యూటర్లు అందించాల్సిందిగా పొట్లూరి రవిని అభ్యర్థించగా.. ఆయన వెంటనే స్పందించి మైక్రోస్కోపులు, స్టడీ మెటీరియల్స్ అందించారని పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడు గోకారి తెలిపారు. కంప్యూటర్లని కూడా పది రోజుల్లో అందిస్తామన్నారని చెప్పారు. కప్పట్రాళ్ల విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడానికి కృషి చేస్తామని తానా మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి తెలిపారు. పాఠశాల విద్యార్థులను ఎన్నారై విద్యార్థులతో ఆన్ లైన్‌లో అనుసంధానం చేసి ఆధునిక సాంకేతిక విద్యను బోధించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వాసుబాబు గోరంట్ల, రామ్ చౌదరిలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్, పారిశ్రామికవేత్త అనంత నాయుడు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023.. జకోవిచ్ ఖాతాలో పదో టైటిల్.. మొత్తంగా 22వ గ్రాండ్‌స్లామ్
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Chiranjeevi: జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం..: చిరంజీవి
-
India News
PM Modi: బడ్జెట్ సమావేశాల వేళ.. మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ