తానా కళాశాల, న్యూ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన

శైలజా చౌదరి ఆధ్వర్యంలో తానా కళాశాల, న్యూ ఇంగ్లాండ్ అధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారామ కల్యాణం కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Published : 07 Jun 2024 17:42 IST

వాషింగ్టన్‌: తానా కళాశాల, న్యూ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారామ కల్యాణం కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. శైలజా చౌదరి ఆధ్వర్యంలో తానా కళాశాలలోని 200 మంది విద్యార్థులు చేసిన ఈ నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ, కృష్ణ వెంపటి కవితా గానం, వడలి ఫణి నారాయణ సంగీత కొరియోగ్రఫీ, శైలజా చౌదరి తుమ్మల కళాత్మక దర్శకత్వం, కొరియోగ్రఫీ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. నృత్య ప్రదర్శన అనంతరం తానా మాజీ కోశాధికారి అమ్మని దాసరి తానా కళాశాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ పద్మావతి యూనివర్సిటీ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. 

శైలజా చౌదరి తుమ్మల గ్రేటర్ బోస్టన్‌లోని శ్రీ కూచిపూడి నాట్యాలయం, తానా కళాశాల న్యూ ఇంగ్లాండ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పద్మశ్రీ డా.శోభా నాయుడు దగ్గర నాట్య శిక్షణ అభ్యసించిన ఆమె.. గత 24 సంవత్సరాలుగా వృత్తిరీత్యా కూచిపూడి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే 34 ఏళ్లుగా ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు గ్రేటర్ బోస్టన్ అధ్యక్షురాలు దీప్తి గోరా, శ్రీనివాస్ గొండి, శివ డోకిపర్తి, చంద్ర రెడ్డివారి, సురేష్ దగ్గుబాటి, రామకృష్ణ కొల్లా, కీర్తి తొగరు, సాయి లక్ష్మి, ఉమా కంతేటి, అనంతా జయం, మాధవి పోరెడ్డి, రజని దగ్గుబాటి, కోటేష్ కందుకూరి, సూర్య తేలప్రోలు, రమణ బిల్లకంటి, సురేష్ సూరపరాజు, మురళి పసుమర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని