సామాజిక సేవలో ‘తానా’ ఒహియో వ్యాలీ

సెప్టెంబర్ 25న ఒహియో వ్యాలీ క్లీవ్‌లాండ్‌లోని 150 మంది పాఠశాల విధ్యార్దులకు ‘తానా’కు చెందిన ఒహియో వ్యాలీ విభాగం బ్యాక్‌ప్యాక్‌లను అందజేసింది.

Published : 16 Oct 2022 01:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెప్టెంబర్ 25న ఒహియో వ్యాలీ క్లీవ్‌లాండ్‌లోని 150 మంది పాఠశాల విధ్యార్దులకు ‘తానా’కు చెందిన ఒహియో వ్యాలీ విభాగం బ్యాక్‌ప్యాక్‌లను అందజేసింది. వీటిని అందజేయడంలో పరమేష్ దేవినేని, రాజా కసుకుర్తి, స్వప్న మండవ, దుర్గ చిట్టిభక్తుని, రాజా అబ్బెనగారి, రవి వడ్లమూడి, సందీప్ గుంటుపల్లి, రామారావు పొంగులూరి, వెంకట్ మట్టా, నవీన్ మండెపూడి, నరేష్ బొడ్డు, ప్రసాద్ మువ్వా, శివ భీమవరపు, రాజ్ తీగల, తాజుల్ షైక్, రమణ ఈర్ల, సునీల్ నరహరి సహాయసహకారాలు అందజేశారు.  

అక్టోబర్ 1న ‘మన ఊరి కోసం’ 5కే వాక్/రన్‌ను ‘తానా’ ఒహియో వ్యాలీ స్థానిక నియోటా సంస్థతో కలిసి నిర్వహించారు. దీనికి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి పారడైస్ ఇండియన్ క్రుసైన్ స్పాన్సర్ చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కాన్సర్, ఉచిత కంటి పరీక్షల శిబిరాలకు విరాళాలు ఇచ్చిన దాతలకు ‘తానా’ ధన్యవాదాలు తెలిపింది. అక్టోబర్ 1న నిర్వహించిన క్రికెట్ టోర్నీకి మంచి ఆదరణ లభించింది. 16 టీమ్‌లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతానికి శశాంక్ యార్లగడ్డ , కిశోర్, వేణు చావా కృషి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉదయ్ పటేల్, మను మెహతా, రియల్ ఫ్లెక్స్, ఇండియన్ క్రుసైన్ వారు స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమాలు అన్ని విజయవంతం కావడానికి అన్నివిధాలా సహకరించిన ‘తానా’ ప్రెసిండెంట్ అంజయ్య చౌదరి లావు,  ‘తానా’ బోర్డు, ‘తానా’ పాలకవర్గం వారికి ‘తానా’ ఒహియో వాలీ ప్రతినిధి రవి వడ్లమూడి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని