దిగ్విజయంగా తెలుగు కళాసమితి, తానా సంగీత ‘రాగావధానం’

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్ నగరంలో న్యూజెర్సీ తెలుగు కళా సమితి, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) సెప్టెంబర్‌ 17న నిర్వహించిన.....

Published : 29 Sep 2022 22:09 IST

న్యూజెర్సీ: అమెరికాలోని ఎడిసన్ నగరంలో న్యూజెర్సీ తెలుగు కళా సమితి, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) సెప్టెంబర్‌ 17న నిర్వహించిన ప్రత్యేక  సంగీత ‘రాగావధానం’ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. గాన విద్యా ప్రవీణ, గురు గరికిపాటి వెంకట ప్రభాకర్ అవధానిగా.. ఈ సంగీత ప్రధానమైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. తెలుగు భాషకే తలమానికమై, సాహిత్యపరంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ‘అష్టావధానం’ మాదిరిగానే ఈ ‘రాగావధానాన్ని’ కూడా కేవలం సంగీత పరమైన వివిధ అంశాలతో నిర్వహించడం విశేషం. న్యూజెర్సీలో తొలిసారి నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమానికి 350మందికి పైగా సంగీత రసజ్ఞులు పాల్గొని   కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తొలుత కార్యదర్శి రవి కృష్ణ అన్నదానం, కల్చరల్  కార్యదర్శి బిందు యలమంచిలి ఈ సదస్సుకు  విచ్చేసిన వారిని  సాదరంగా ఆహ్వానించారు. గరికిపాటి వెంకట ప్రభాకర్ వద్ద సంగీత శిక్షణ పొందిన శిష్య బృందం నిహాల్ సాయి కనిశెట్టి, ఉల్లాస్ కావూరి, అనుష్క బంజా, ఆరుషి సాయి వీణ, వందిత పి. గబ్బిట, కళ్యాణి దేశపాండే, రమా ప్రభ, రవి కామరాసు, డాక్టర్ పద్మశ్రీ వేలూరి, నీలవేణి కందుకూరి, డా. లక్ష్మీ కిషోర్ రెండు పాటలు శ్రావ్యంగా ఆలపించి సంగీత ప్రియులను అలరించారు. తానా కమ్యూనిటీ  కార్యదర్శి రాజా కసుకుర్తి,  అవధాని  గరికిపాటి వెంకట ప్రభాకర్‌కు స్వాగతం పలికి రాగావధానం కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరారు. ఈ రాగావధాన కార్యక్రమానికి సమన్వయకర్తగా Dr.మధు దౌలపల్లి వ్యవహరించగా, శారదా ఖండవల్లి, వేణు ఓరుగంటి, డా. భాస్కర్ కొంపెల్ల, అరుణ గరిమెళ్ళ, రేఖా బ్రహ్మసముద్రం, జయ చిక్కా, దీప్తి దేశిరాజు  పృచ్ఛకులుగా వ్యవహరించి శాస్త్రీయ సంగీత పట్టుగొమ్మలైన కర్ణాటక, హిందుస్తానీ రాగాలను పైన పేర్కొన్న అంశాల్లో పొందుపరిచి అర్థవంతమైన, నిగూఢమైన, గమ్మత్తైన ప్రశ్నలుగా సంధించారు. వీటికి గురు ప్రభాకర్ తన అసామాన్యమైన సంగీత జ్ఞానంతో, ధారణా ప్రతిభతో, సమయస్పూర్తితో, వివరణ పూర్వకంగా సమస్యలను శ్రావ్యంగా పాడి, పూరించి, అందరి మన్ననలు అందుకున్నారు. రెండు ఆవృతాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య సంకీర్తనాలతో పాటు సినిమా పాటలు, జానపదాలు, లలిత సంగీతం, దేశభక్తి గీతాలు, పద్యాలు మొదలైన వైవిధ్య భరితమైన అంశాలలో పాటలను ఎంచుకుని, పృచ్చకులు వేరువేరు రాగ తాళాలలో ప్రశ్నలు సంధించారు. ఈ రాగావధాన కార్యక్రమంలో ఈ ప్రక్రియలను సమర్థవంతంగా ప్రదర్శించారు.

  • రాగ మార్పు - శాస్త్రీయ సంగీతం & సినిమా సంగీతం (శారదా ఖండవిల్లి) 
  • రాగ మార్పు - రాగమాలిక - సినిమా సంగీతం (దీప్తి దేశిరాజు) 
  • భావ మార్పు - సినిమా సంగీతం (మధు దౌలపల్లి) 
  • గతి బేధం - సినిమా సంగీతం (రేఖా బ్రహ్మసముద్రం)
  • గతి బేధం - సినిమా జానపదం (జయా చిక్కా)
  • స్వరాక్షరం - పద్యం, శ్లోకం (భాస్కర్ కొంపెల్ల)
  • నిషిద్ధ స్వరం - జానపద సంగీతం (దీప్తి దేశిరాజు)
  • రస మార్పు - శాస్త్రీయ సంగీతం (అరుణా గరిమెళ్ళ)
  • రస మార్పు - లలిత సంగీతం (రేఖా బ్రహ్మసముద్రం)
  • అప్రస్తుత ప్రసంగం (వేణు ఓరుగంటి)

అమెరికాలో తెలుగు భాష, సాహిత్యం, సంప్రదాయ కళలను ప్రోత్సహించడానికే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామని తెలుగు కళాసమితి అద్యక్షుడు మధు రాచకుళ్ళ తెలిపారు. ఈ సందర్భంగా  తెలుగు కళా సమితి - ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా )  వారు గరికపాటి వెంకట ప్రభాకర్‌ను స్వర శుభకర అనే బిరుదు ప్రదానం చేసారు. తెలుగు కళా సమితి  కార్యవర్గంతో పాటు ఈ కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) ప్రతినిధులు లక్ష్మి దేవినేని,  రాజా కసుకుర్తి, రవి పొట్లూరి, శ్రీనివాస్ ఓరుగంటి, శ్రీనాథ్‌  కోనంకి చౌదరి, శివాని తానా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు కళా సమితి వ్యవస్థాపక సభ్యులైన పోలేపల్లి శంకరరావును, మూర్తి భావరాజు, దాము గేదెలను గౌరవ అతిధులుగా ఆహ్వానించి తెలుగు కళా సమితి కార్యవర్గం ఘనంగా సత్కరించింది. ఉపాధ్యక్షురాలు అనూరాధ దాసరి, యువజన కార్యదర్శి సుధా దేవులపల్లి స్పాన్సర్ల వ్యవహారాలను పర్యవేక్షించారు. కార్యదర్శి రవికృష్ణ అన్నదానం, కల్చరల్ కార్యదర్శి  బిందు యలమంచిలి కార్యక్రమ నిర్వహణ వ్యవహారాలను పర్యవేక్షించారు. కోశాధికారి శ్రీనివాస్ చెరువు ఆడియో, బ్యానర్స్,  కావలసిన వస్తువుల కొనుగోలు వ్యవహారాలను పర్యవేక్షించారు. మెంబర్‌షిప్‌  కార్యదర్శి  జ్యోతి కామరసు మీడియా వ్యవహారాలను పర్యవేక్షించారు. కమ్యూనిటీ కార్యదర్శి వెంకట సత్య తాతా, ఇటి కార్యదర్శి నాగ మహేందర్ వెలిశాల మొత్తం భోజన ఏర్పాట్లు, వాలంటీర్ల వ్యవహారాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసిన స్పాన్సర్లకు, విజయవంతం చేసేలా కష్టపడిన వాలంటీర్లకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు శ్రీనివాస్ గనగోని (TTA), రఘు శంకరమంచి (Sai Datta Peetham), మురళి మేడిచర్ల  (NATS), ఉషా చింతా(NATA), సంతోష్ రెడ్డి కోరం (ATA),  విలాస్ జంబుల(ATA), రాజ్ చిలుముల (ATA), మధు అన్నా (GSKI), ప్రసాద్ కునిశెట్టి (TPF),  లక్ష్మి & ప్రవీణ్ గూడూరు దంపతులు (SPBMI), శరత్ వేట, మహేష్ నాగళ్ళ (మనబడి), మంజు భార్గవ& మోహన్ దంపతులు(NJTA),  కృష్ణ కొత్త(TPF), స్వాతి & అట్లూరి దంపతులు (కళా వేదిక), నరసింహ పెరుక(TTA), నరేందర్ యారవ (TTA), విజయ భాస్కర్(TTA), కిరణ్ చాగర్లమూడి(TPF), కొడవటిగంటి శ్రీనాథ శర్మ, కొడవటిగంటి మహాదేవ శర్మ(Sanskrit Brothers), విజ్ఞాన్ కుమార్ (తెలుగు జ్యోతి సంపాదకులు) తదితరులు హాజరయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని