Sankranti: ఘనంగా కెనడా తెలంగాణ అసోసియేషన్ తీన్మార్‌ సంక్రాంతి సంబరాలు

కెనడాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్నా పెద్దా సంప్రదాయ వస్త్రధారణతో సంక్రాంతి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Updated : 18 Jan 2023 16:46 IST

టోరంటో: తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో తీన్మార్ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు 1500మందికి పైగా తెలంగాణ వాసులు హాజరై సందడి చేశారు. టీసీఏ స్పాన్సర్స్‌ దివ్య దొంతి, కస్తూరి ఛటర్జీ,  మనస్విని వెలపాటి,  శ్వేతా పుల్లూరి, శ్రేయ ఆకుల జ్యోతిప్రజ్వలన చేసి తీన్మార్‌ సంక్రాంతి-2023 సంబరాలను ప్రారంభించారు. ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ, వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్టు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో చిన్నా, పెద్దా పాల్గొని సందడి చేశారు. భోగి పళ్ళు, పిల్లల సాంప్రదాయ వేడుకలు, విచిత్ర వేషాధారణ, డ్రాయింగ్, పతంగుల తయారీ, క్విజ్, ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళా కమిటీ సభ్యులు రాధికా బెజ్జంకి, ప్రసన్న మేకల, మాధురి చటరాజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ కెనడా అసోసియేషన్  2023 టోరంటో తెలుగు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ.. తెలంగాణ పండుగలు, సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా  ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవం అనే గీతం స్ఫూర్తితో తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో కృషి చేస్తోందన్నారు. తీన్మార్ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి దీపా గజవాడ సహకారంతో కుమారి ప్రహళిక మ్యాకల, రాహుల్ బాలనేని ఐదు గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకుల్ని అలరించారు. ఈ ఉత్సవానికి వివిధ విభాగాల్లో పోటీలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించింది. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా చేసిన స్కిట్, పలు నృత్య ప్రదర్శనలు, విచిత్ర వేషాధారణ ప్రేక్షకుల్ని అలరింపజేశాయి. పోటీల్లో గెలిచిన అందరికీ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం చివరిలో మహిళలకు పసుపు, కుంకుమ, తెలంగాణ ఫలహారాలతో కూడిన వాయనాలను అందజేసి తెలంగాణ కెనడా అసోసియేషన్ తన ప్రత్యేకతను చాటుకుంది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ కెనడా అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి, కార్యదర్శి శంతన్ నారెళ్ళపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర, సాంస్కృతిక కార్యదర్శి దీపా గజవాడ, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి ప్రహళిక మ్యాకల, కోశాధికారి వేణుగోపాల్ ఐల, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని; డైరెక్టర్లు నాగేశ్వరరావు దలువాయి, ప్రవీణ్ కుమార్ శ్యామల, ప్రణీత్ పాలడుగు, శంకర్ భరద్వాజ పోపూరి, యూత్ డైరెక్టర్ ధాత్రి అంబటి, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ ఛైర్మన్ నవీన్ ఆకుల; బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు మురళి సిరినేని, ప్రసన్న మేకల,  మురళీధర్ కందివనం, మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ ఛైర్మన్ అతిక్ పాషా; వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, కలీముద్దీన్ మొహమ్మద్, ప్రకాష్ చిట్యాల, అఖిలేష్ బెజ్జంకి, ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీనివాస తిరునగరి, హరి రాహుల్, సంతోష్ గజవాడ, విజయ్ కుమార్ తిరుమలపురం, పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని