‘మహానాడు’కు మన్నవ మోహన కృష్ణ ₹25లక్షల విరాళం

రాజమండ్రిలో జరగనున్న మహానాడుకు తెదేపా నేత మన్నవ మోహన కృష్ణ ₹25లక్షల విరాళం  అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయన్ను ప్రశంసించారు.

Updated : 26 May 2023 18:55 IST

అమరావతి: రాజమండ్రిలో జరగనున్న తెదేపా ‘మహానాడు’కు ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నాట్స్‌ మాజీ అధ్యక్షుడు (USA) మన్నవ మోహన కృష్ణ విరాళం ప్రకటించారు. రూ.25లక్షల విరాళం చెక్కును తెదేపా అధినేత చంద్రబాబును కలిసి అందజేశారు. గతేడాది ఒంగోలులో జరిగిన మహానాడుకు సైతం ఆయన రూ.31లక్షల విలువ చేసే వాటర్‌ బాటిల్స్‌ను అందజేశారు.  గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెదేపా నేత అయిన మోహన కృష్ణను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. ఎన్నో ఏళ్లుగా అటు అమెరికాలోను, ఇటు ఏపీలో తెదేపాకు అండగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా మోహన కృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబు మళ్లీ సీఎంగా అసెంబ్లీలో అడుగు పెట్టేవరకూ తాను అవిశ్రాంత సైనికుడిలా పనిచేస్తానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని