కెనడాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కెనడాలోని ‘తెలంగాణ కెనడా అసోసియేషన్’ (TCA) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఓక్‌విల్‌లోని కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్వహించిన వేడుకల్లో సుమారు 1200 మందికి పైగా పాల్గొన్నారు.

Published : 05 Oct 2022 00:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెనడాలోని ‘తెలంగాణ కెనడా అసోసియేషన్’ (TCA) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఓక్‌విల్‌లోని కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన వేడుకల్లో సుమారు 1200 మందికి పైగా పాల్గొన్నారు. ‘తెలంగాణ కెనడా అసోసియేషన్’ అధ్యక్షుడు ఈద  రాజేశ్వర్ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రూపొందించిన ఆరు అడుగుల ఎత్తున్న బతుకమ్మ చూపరులను ఆకట్టుకుంది. మహిళలు, చిన్నారులు బతుకమ్మ ఆడారు. నిమజ్జనం అనంతరం సత్తుపిండి, నువ్వులపిండి, పల్లీ పిండి ప్రసాదాలను పంపిణీ చేశారు. పలు వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. వేడుకల నిర్వహణకు సహకరించిన శ్రీనివాస్ పబ్బ, శ్వేతా పుల్లూరి, ప్రశాంత్ మూల, మనస్విని వేళాపాటి, రికెల్ హూంగేను, ఈద రాజేశ్వర్ అభినందించి జ్ఞాపికలను అందజేశారు. 

కార్యక్రమంలో బోర్డు అఫ్ ట్రస్టీ ఛైర్మన్ సంతోష్ గజవాడ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం, దామోదర్ రెడ్డి మాది, నవీన్ ఆకుల, దీప గజవాడ, గిరిధర్ క్రోవిడి, ఉదయ్‌ భాస్కర్ గుగ్గిళ్ల, రాహుల్ బాలినేని, ధాత్రి అంబటి, శ్రీనివాస్ రెడ్డి దేప, రాజేష్ ఆర్రా, ప్రకాష్ చిట్యాల, మనోజ్ రెడ్డి, కోటేశ్వరరావు చిత్తలూరి, దేవేందర్ రెడ్డి గుజ్జుల, ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీనివాస్ తిరునగరి, శ్రీనాథ్ కుందూరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని