ఫార్మింగ్టన్‌లో జీటీఏ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో అమెరికాలోని ఫార్మింగ్టన్‌లో తెలంగాణ 10వ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రెండు వందలకు పైగా ప్రవాస తెలుగు కుటుంబ సభ్యులు ఒక్కచోట చేరి ‘పల్లె వంట’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. 

Published : 03 Jun 2024 23:52 IST

ఫార్మింగ్టన్: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో అమెరికాలోని ఫార్మింగ్టన్‌లో తెలంగాణ 10వ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. రెండు వందలకు పైగా ప్రవాస తెలుగు కుటుంబ సభ్యులు ఒక్కచోట చేరి స్థానిక షియావస్సీ పార్క్‌లో ‘పల్లె వంట’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పలు తెలంగాణ సంప్రదాయ వంటలను ప్రదర్శించారు. జానపద సంగీతం, వెంట్రిలాక్విజం, నృత్య ప్రదర్శనలతో సహా పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. అథ్లెటిక్స్, వాటర్ బెలూన్‌లు, బ్లైండ్-ఫోల్డ్, మ్యూజికల్ ఛైర్‌ పోటీల్లో మహిళలతో పాటు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 
 
ఈ కార్యక్రమంలో పాతతరం నటుడు, కళాకారుడు రంపా (రంగస్థల పేరు) పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంలో జీటీఏ, దాని కమిటీ సభ్యుల నిబద్ధత, ఉత్తేజం తనను ఆశ్చర్యపరిచినట్లు తెలిపారు. సమాజ బలం, ఐక్యతను కొనసాగించడానికి ఇలాంటి కార్యకలాపాలను ప్రోత్సహించాలన్నారు. ఇందులో భాగంగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించి పలువురికి వైద్య పరీక్షలు చేశారు. టెడెక్స్‌ స్పీకర్, లైఫ్ కోచ్, వెంట్రిలోక్విజం అవార్డు గ్రహీత ఎం.సంతోష్ కుమార్ తన ప్రదర్శనతో ఆహుతులను ఆకట్టుకున్నారు. 

జీటీఏ డెట్రాయిట్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్ కమల్ పిన్నపురెడ్డి నేతృత్వంలోని 50 మందికి పైగా వాలంటీర్లు ఈ కార్యక్రమానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకట్ వదనాల, యాదగిరి ఇలేని, యుగంధర్ భూమిరెడ్డి, కరుణాకర్ కందుకూరి, సాయినాథ్ లచ్చిరెడ్డిగారి, శ్రీరామ్ జాల, సందీప్ నారాయణప్ప, సత్యధీర్ గంగసాని, ప్రేమ్ రెడ్డి చింతపల్లి, లక్ష్మీనారాయణ కర్నాల, శ్రీకాంత్ చింతల, ప్రవీణ్ ముద్దసాని, అశోక్ వెలుదండి, వెంకట్ నాటాల, అరుణ్ బచ్చు, గోవర్ధన్ పిన్నంరెడ్డి, డీజే వేణు, రాహుల్ పాల్‌రెడ్డి, అభిలాష్, నవదీప్ వెంపటి, రాజేష్, శ్రావణ్, సంతోష్ గుండ, జీటీఏ-వనిత, సుమ కలవల, సుష్మా పదుకొనె, స్వప్న చింతపల్లి, దీప్తి లచ్చిరెడ్డిగారి, కళ్యాణి ఆత్మకూర్, డాక్టర్ అమిత కాకులవరం పాల్గొన్నారు. ఈ కమిటీకి డెట్రాయిట్‌లోని జీటీఏ-యూఎస్‌ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ప్రవీణ్ కేసిరెడ్డి (GTA అధ్యక్షుడు), కృష్ణ ప్రసాద్ జాలిగామ, మహేష్ వేణుకదాసుల, మల్లిక్ పదుకొనె, సంతోష్ కాకులవరం తమ మద్దతు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు