TANA: సిరివెన్నెల సాహిత్య రచనలకు పుస్తక రూపం

ప్రముఖ సినీగీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన సినీ, సినీయేతర సాహిత్యాలను ఆరు సంపుటాలను ప్రచురించినట్లు తానా సాహిత్య విభాగం- తానా ప్రపంచ సాహిత్య వేదిక వెల్లడించింది.

Published : 19 Oct 2023 22:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సినీగీత రచయిత దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన సినీ, సినీయేతర సాహిత్యాలను ఆరు సంపుటాలను ప్రచురించినట్లు తానా సాహిత్య విభాగం- తానా ప్రపంచ సాహిత్య వేదిక వెల్లడించింది. సిరివెన్నెల కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇది సాధ్యమైందని ఓ ప్రకటనలో పేర్కొంది. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి నిర్వహణలో, తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు ప్రసాద్‌ తోటకూర సంపాదకులుగా, ప్రముఖ సాహిత్యవేత్త కిరణ్‌ ప్రభ ప్రధాన సంపాదకుడిగా అత్యున్నత ప్రమాణాలతో ఈ గ్రంథాలను రూపొందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం- సినిమా పాటలు మొదటి సంపుటి (1986 నుంచి 1992 వరకు-513 పాటలు), రెండో సంపుటి (1993 నుంచి 1995 వరకు-509 పాటలు), మూడో సంపుటి (1996 నుంచి 2002 వరకు - 549 పాటలు), నాలుగో సంపుటి (2003 నుండి 2022; 470 పాటలు) మొత్తం 2,041 పాటలను అక్షరబద్ధం చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. సినీయేతర సాహిత్య రచనలను ఐదవ సంపుటి (417 పేజీలు), ఆరవ సంపుటి (464 పేజీలు)గా ముద్రించినట్లు తెలిపింది.    

ప్రస్తుతం సిరివెన్నెల సీతారామశాస్త్ర సమగ్ర సాహిత్యం ఆరు సంపుటాలు అమెరికా సహా, భారత్‌లనూ అందుబాటులో ఉన్నాయని తానా సాహిత్య విభాగం వెల్లడించింది. అమెరికాలో కొనుగోలు చేయాలనుకున్న వారు డా. ప్రసాద్‌ తోటకూర మొబైల్‌ నెంబర్‌ 817 300 4747లో గానీ, prasadthotakura@gmail.comగానీ సంప్రదించవచ్చు. భారత్‌లో కొనుగోలు చేయదలచినవారు శ్రీరామశర్మ, మొబైల్‌ నెంబర్‌ +91-94400-66633లో గానీ లేదా  sriramasastry@gmail.comలో గానీ సంప్రదించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని