అమెరికాలో మే 24-26 మధ్య టీటీఏ మహాసభలు

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ) అగ్రరాజ్యంలో భారీగా మహాసభలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు టీటీఏ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.

Updated : 10 Mar 2024 12:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ) అగ్రరాజ్యంలో భారీగా మహాసభలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు టీటీఏ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సియాటెల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మే 24, 25, 26 తేదీల్లో నిర్వహించే ఈ సభలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. 

మెగా కన్వెన్షన్‌ కోసం ఇప్పటికే కిక్‌ ఆఫ్‌ ఫండ్‌ రైజింగ్‌ పేరిట ఈవెంట్స్‌ జరుగుతున్నాయి. యూఎస్‌లోని 32 రాష్ట్రాల్లో విస్తరించిన టీటీఏ ఇప్పటికే పలు చోట్ల దీన్ని ఘనంగా నిర్వహించింది. ఈ ఈవెంట్లకు భారీ స్పందన వచ్చిందని వంశీరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మహాసభల్లో భాగంగా సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించనున్నారు. భద్రాచలం నుంచి వేదపండితులు వచ్చి స్వామివారి కల్యాణం జరిపిస్తారు. సభల్లో టీటీఏ సావనీర్‌ను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేక సంచిక కోసం రచనలను ఆహ్వానిస్తున్నారు. షార్ట్‌ ఫిల్మ్‌ కాంటెస్ట్‌ కూడా ఏర్పాటు చేశారు. టాలీవుడ్‌ సెలబ్రిటీలు ఎంపిక చేసిన బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌లకు అవార్డులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాలను mytelanganaus.org వెబ్‌సైట్‌తో పాటు సోషల్‌ మీడియా ఖాతాలో చూడొచ్చన్నారు. టీటీఏను ఏర్పాటు చేసిన డా.పైళ్ల మల్లారెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్‌ ఛైర్‌ డా.విజయ్‌పాల్‌ రెడ్డి, కోఛైర్‌ డా.మోహన్‌రెడ్డి పటోళ్ల, సభ్యులు భరత్‌రెడ్డి మాదాడి సేవలను వంశీరెడ్డి కొనియాడారు. వారి బాటలో కొనసాగడం గర్వంగా ఉందన్నారు. 

వంశీరెడ్డితో పాటు టీటీఏ ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ నవీన్‌రెడ్డి మల్లిపెద్ది, జనరల్‌ సెక్రటరీ కవితారెడ్డి, కోశాధికారి సహోదర్‌ పెద్దిరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా.దివాకర్‌ జంధ్యం, జాయింట్‌ సెక్రటరీ శివారెడ్డి కొల్ల, జాయింట్‌ ట్రెజరర్‌ మనోహర్‌ బోడ్కె, నేషనల్‌ కో-ఆర్డినేటర్‌ ప్రదీప్‌ మెట్టు, ఇంటర్నల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రసాద్‌ కూనవరపు, నేషనల్‌ ఇంటర్నల్‌ అఫైర్స్‌ కో-ఆర్డినేటర్‌ వెంకన్నగారి సురేశ్‌రెడ్డి, మీడియా కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ నిషాంత్‌ సిరికొండ, మెంబ‌ర్‌షిప్ అడ్వైజ‌ర్ అమిత్ రెడ్డి సుర‌కంటి, ఎథిక్స్ క‌మిటీ డైరెక్టర్‌ గ‌ణేష్ మాధ‌వ్, ఉమెన్స్ ఫోరం అడ్వైజ‌ర్ స్వాతి చెన్నూరి, హెల్త్ వెల్‌నెస్ అడ్వైజ‌ర్ జ్యోతి రెడ్డి, ఇండియా కో-ఆర్డినేట‌ర్ ద్వార‌క‌నాథ్ రెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని