Anjaya Chaudhary Lavu: అంజయ్య చౌదరితో యూఏఈ తెలుగు అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం

తానా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావుతో యూఏఈ తెలుగు అసోసియేషన్‌ కార్యనిర్వాహక సభ్యులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

Published : 29 May 2024 11:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తానా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావుతో యూఏఈ తెలుగు అసోసియేషన్‌ కార్యనిర్వాహక సభ్యులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దుబాయ్‌లోని ఇండియన్‌ క్లబ్‌లో ఈ సమావేశం జరిగింది. ఒకటిన్నర దశాబ్ద కాలంలో తానాలో వివిధ కీలక పదవులు నిర్వహించి విశేష సేవలందించిన అంజయ్య చౌదరి.. ఆ సంస్థ తెలుగు వారికి అందిస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. తానా సుదీర్ఘ కాలం సేవలందించేందుకు ప్రధాన కారణం సంస్థాగత నిర్మాణమేనని చెప్పారు. వివిధ విభాగాల రూపకల్పన, కార్యక్రమాల నిర్వహణా విధానాలు, బోర్డు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీల పరస్పర సహకారం, నిధుల సేకరణ వంటి అనేక అంశాలపై అంజయ్య చౌదరి సుదీర్ఘంగా వివరించారు. 

తెలుగు అసోసియేషన్‌- యూఏఈ ప్రస్తుత, పూర్వ కార్యనిర్వాహక సభ్యులు తాము చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అసోసియేషన్‌ ఆవిర్భావం నుంచి నేటి వరకు నిర్వహించిన సాంస్కృతిక, సామాజిక, సేవా కార్యక్రమాలను చెప్పారు. ప్రారంభించిన కొద్ది సంవత్సరాల్లోనే ఇన్ని మంచి కార్యక్రమాలు చేపట్టడంపై అంజయ్య చౌదరి అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో ఇలాంటివి చేయాలని.. తెలుగువారికి సేవలందించాలని సూచిస్తూ తానా తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి చొరవ తీసుకున్న యూఏఈ తెలుగు అసోసియేషన్‌ను అభినందించారు. ఇటువంటివి మున్ముందు కూడా చేపట్టాలని.. తద్వారా తానా, ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు సంఘాలు పరస్పర సహకారాలు ఇచ్చిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. దీంతో తెలుగువారికి మరింత సేవా కార్యక్రమాలు చేసే అవకాశం లభిస్తుందన్నారు. అంజయ్య చౌదరి లావు, తానా, ఇతర తెలుగు సంఘాలు అమెరికాలోని తెలుగువారికి అందిస్తున్న సేవా కార్యక్రమాలు తమకు ఎంతో స్ఫూర్తిదాయకమని యూఏఈ తెలుగు అసోసియేషన్‌ సభ్యులు అన్నారు. అనంతరం అంజయ్య చౌదరిని ఘనంగా సత్కరించారు. 

ఈ కార్యక్రమంలో యూఏఈ తెలుగు అసోసియేషన్‌ ప్రస్తుత కార్యనిర్వాహక ఛైర్మన్‌ వివేకానంద్‌ బలుస, ప్రెసిడెంట్‌ మసివుద్దీన్‌, జనరల్‌ సెక్రటరీ విజయ్‌ భాస్కర్‌, ట్రెజరర్‌ శ్రీనివాస్‌గౌడ్‌, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ డైరెక్టర్‌ సురేంద్ర ధనేకుల, ఆంధ్రా సంక్షేమ విభాగ డైరెక్టర్‌ శ్రీధర్‌, కమ్యూనిటీ సర్వీసెస్‌ డైరెక్టర్‌ భీం శంకర్‌ బంగారి, తెలంగాణ సంక్షేమ విభాగ డైరెక్టర్‌ చైతన్య చకినాల, పూర్వకార్యనిర్వాహక బృందం నుంచి ఛైర్మన్‌ దినేష్‌ కుమార్‌ ఉగ్గిన, ట్రెజరర్‌ మురళీకృష్ణ నూకల, తెలంగాణ సంక్షేమ విభాగ డైరెక్టర్‌ షేక్‌షావలి హాజరయ్యారు. వీరితో పాటు ఫారెస్ట్‌ నేషన్‌ ఎండీ శరత్‌ నల్లమోతు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని