Ugadi Celebrations: ఘనంగా ‘కెంటకీ తెలుగు సంఘం’ ఉగాది వేడుకలు

కెంటకీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.

Updated : 29 Apr 2024 19:33 IST

అమెరికా: కెంటకీ రాష్టంలోని లుయివిల్ నగరంలో కెంటకీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ప్రవాస తెలుగువారు పెద్దసంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జీవా ఫౌండేషన్‌ బృందం నృత్య రూపకం, మనబడి విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు అలరించాయి. అనిల్ గంటేటి, రఘు దేవరకొండ, గజానన్ ముదల్కర్, ఈశ్వర్ వారణాశి బృందం ప్రదర్శించిన గ్లెన్ "టెటి" బాబా స్కిట్ ప్రేక్షకులను నవ్వించింది.

ఈసందర్భంగా కెంటకీ తెలుగు సంఘం అధ్యక్షులు శ్యాం కోయ మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల తెలుగు ఎన్నారైలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో సహకరించిన కార్యనిర్వాహక బృందం, వాలంటీర్లను బోర్డు ఛైర్మన్‌ శ్రీని జూలకంటి అభినందించారు. మోహన్ తాళ్లూరి, సుష్మా తాళ్లూరి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా కొనసాగింది. శ్రీనివాస్ వేమూరి, శిరీష వనం, రమ్య పెంట  సాంస్కృతిక కార్యదర్శులుగా వ్యవహరించగా.. హైదరాబాద్ హౌస్ వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి విందు భోజనం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని