నెదర్లాండ్స్‌లో వైభవంగా ఉగాది వేడుకలు

నెదర్లాండ్స్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. 

Updated : 02 Apr 2023 22:40 IST

ఉట్రెక్ట్‌: నెదర్లాండ్స్‌లోని ఉట్రెక్ట్‌ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. నెదర్లాండ్స్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో  సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకల్లో  తెలుగు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నెదర్లాండ్స్‌లోని 30 సిటీల నుంచి దాదాపు 400కు పైగా తెలుగు కుటుంబాలకు చెందినవారు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. నెదర్లాండ్స్‌లో పనిచేస్తున్న తెలుగు కమ్యూనిటీ కోసం ఏడేళ్లుగా ఈ సంఘం పనిచేస్తోంది. వచ్చే రెండేళ్ల పాటు సంస్థను నడిపించేందుకు ఈ ఏడాది కొత్త బోర్డు ఏర్పాటైంది.  నెదర్లాండ్స్‌ తెలుగు సంఘం ఏర్పాటైనప్పటి నుంచి ఇది నాలుగో బోర్డు కావడం గమనార్హం. ఈ వేడుకల్లో చిన్నారులు, యువత డ్యాన్సులతో అదరగొట్టారు. సుందరాకాండపై తెలుగు బడి, రామాయణ వరల్డ్‌ కిడ్స్‌ ఆధ్వర్యంలో రూపొందించిన స్కిట్‌ ఈ ఏడాది ఉగాది వేడుకల్లో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు హాజరైన అందరికీ సంప్రదాయ తెలుగు వంటకాలతో విందు ఏర్పాటు  చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని