Ugadi Celebrations: వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు

ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి.

Updated : 17 Apr 2024 21:01 IST

ఓర్లాండో: ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. చిన్నా, పెద్దా కలిసి ఈ వేడుకల్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాత, కొత్త తరాలను అలరించేలా రూపొందించిన ‘జయంత విజయం’ పద్య నాటకం ప్రవాసాంధ్రులను మంత్రముగ్దుల్ని చేసింది. మహాభారతంలో అత్యంత కీలకమైన విరాటపర్వం ఆధారంగా ప్రదర్శించిన ఈ రంగస్థల దృశ్యకావ్యం, భారతీయ పురాణాలు, ఇతిహాసాల ధార్మికత్వాన్ని చాటిచెప్పేలా ఉంది. తటవర్తి గురుకులం వారి పద్యకల్పనలో భాగంగా, తటవర్తి కళ్యాణ చక్రవర్తి రచించిన ఈ నాటకాన్ని తిక్కన విరాటపర్వంలోని పద్యాలను సులభమైన తెలుగు నేపథ్యంతో మేళవింపుతో ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమానికి దాదాపు వెయ్యి మందికి పైగా హాజరై సందడి చేశారు.

 

ఓర్లాండో తెలుగు సంఘం వారి సమన్వయంతో చెరుకూరి మధు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఈ నాటకంలో వెంకట శ్రీనివాస్ పులి, దీకొండ జయశ్రీ, నిడమర్తి కృష్ణ, యఱ్ఱాప్రగడ సాయి ప్రభాకర్, కసిరెడ్డి ఇంద్రసేన, శీలం గోపాల్, నిడమర్తి అరుణ, ఏనపల్లి మహేందర్, దివాకర్ల పవన్ కుమార్, దివాకర్ల ప్రసూన ముఖ్య పాత్రధారులు కాగా, శ్రీధర్ ఆత్రేయ అందించిన నేపథ్య సంగీతం, ఆర్‌జే మామ మహేష్‌ కర్టెన్ రైజర్ వాయిస్ ఓవర్ ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని