టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు

తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి.

Published : 16 Apr 2024 16:19 IST

టోరంటో: తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్‌లో నిర్వహించిన ఈ సాంస్కృతిక వేడుకల్లో దాదాపు 1500 మందికి పైగా తెలంగాణ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. గుప్తేశ్వరి వాసుపిల్లి, సరిత ప్యారసాని, ప్రసన్న గుజ్జుల, భవానీ సామల, విజయ చిత్తలూరి జ్యోతి ప్రజ్వలన చేయగా.. గుప్తేశ్వరి వాసుపిల్లి గణేశుడి వందనంతో ఉగాది 2024 సంబరాలను ప్రారంభించారు.

ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు ఆఫ్ ట్రస్టీ, వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారి నరసింహాచారి శ్రోతలకు పంచాంగ శ్రవణం చేశారు. శ్రీరంజని కందూరి, ప్రహళిక మ్యాకల వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చింది. పలువురు పెద్దలు, చిన్నారులు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. ప్రవీణ్ నీలా దర్శకత్వంలో రచించిన చిన్న పిల్లలతో ప్రదర్శించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ నాటిక ప్రేక్షకుల్ని అలరింపజేసింది. అలాగే, మనబడి చిన్నారులు ప్రదర్శించిన బుర్రకథకు విశేషాదరణ లభించింది. మొత్తం 87 మంది 25 వినూత్నమైన ప్రదర్శనలతో నాలుగు గంటల పాటు ప్రేక్షకులను ఉల్లాసపరిచారు.

తెలంగాణ కెనడా సంఘం అధికారిక తెలుగు పత్రిక ‘TCA ఉగాది సంచిక’ తృతీయ సంచికను విడుదల చేశారు. దీన్ని NCPL అధినేత రాంబాబు వాసుపిల్లి ఆవిష్కరించి పాలకమండలి సభ్యులకు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాషను ప్రోత్సహిస్తున్న తెలంగాణ కెనడా సంఘం వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ కెనడా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ.. మన మాతృభాష ప్రాముఖ్యత భావితరాలకు తెలియజేసేందుకే ఈ సంచికను ప్రారంభించినట్లు చెప్పారు. అనంతరం ఈ వేడుకలకు హాజరైన అందరికీ ఉగాది పచ్చడితో పాటు భక్షాలతో కూడిన రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి, కార్యదర్శి శంతన్ నారెళ్ళపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి ప్రహళిక మ్యాకల, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ళ, డైరెక్టర్లు - నాగేశ్వరరావు దలువాయి, ప్రణీత్ పాలడుగు, శంకర్ భరద్వాజ పోపూరి, ప్రవీణ్ కుమార్ శ్యామల,  భగీరథ దాస్ అర్గుల, ధర్మకర్తల మండలి ఛైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు - మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ ఛైర్మన్ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు - దేవేందర్ రెడ్డి గుజ్జుల,  కోటేశ్వరరావు చిత్తలూరి, హరి రాహుల్ , కలీముద్దీన్ మహమ్మద్, శ్రీనివాస తిరునగరి, ప్రకాష్ చిట్యాల, రాజేశ్వర్ ఈద, ప్రభాకర్ కంబాలపల్లి, విజయ్ కుమార్ తిరుమలపురంతో పాటు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని