US Visa: అమెరికా టూర్ వెళ్లాలనుకునే విదేశాల్లోని భారతీయులకు శుభవార్త!
విదేశాల్లో ఉండే భారతీయులు బీ1/బీ2 వీసా కోసం భారత్‌కు రావాల్సిన అవసరం లేకుండా అమెరికా రాయబార కార్యాలయం ఆయా దేశాల్లో వీసా అపాయింట్‌మెంట్ జారీ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.
దిల్లీ: వ్యాపార అవసరాల నిమిత్తం, విహారయాత్రల కోసం అమెరికా వెళ్లే భారతీయులు వేగంగా వీసా పొందేందుకు ఆ దేశ రాయబార కార్యాలయం కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. బీ1/బీ2 వీసా మీద అమెరికా వెళ్లాలనుకుని విదేశాల్లో ఉన్న భారతీయులు ఆయా దేశాల్లోని అమెరికా కాన్సులేట్ లేదా రాయబార కార్యాలయాల్లో కూడా వీసా అపాయింట్‌మెంట్‌ను పొందొచ్చని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ట్విటర్‌లో ఒక ప్రకటన చేసింది. దీంతో విదేశాల్లో ఉండే భారతీయులు అమెరికా వీసా కోసం భారత్‌కు రావాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న భారతీయులు అమెరికాకు వెళ్లాలనుకుంటే.. బీ1/బీ2 వీసా అపాయింట్‌మెంట్ కోసం భారత్‌కు రాకుండా బ్యాంకాక్‌లోని అమెరికా కాన్సులేట్ లేదా రాయబార కార్యాలయంలో వీసా అపాయింట్‌మెంట్‌ను పొందొచ్చు.
‘‘త్వరలో మీరు విదేశీ ప్రయాణం చేయబోతున్నారా? అయితే మీరు వీసా అపాయింట్‌మెంట్ మీరు నివసిస్తున్న ప్రాంతంలోని అమెరికా కాన్సులేట్ లేదా రాయబార కార్యాలయం నుంచి పొందొచ్చు. ఉదాహరణకు రాబోయే నెలల్లో థాయ్‌లాండ్‌లో ఉండబోయే భారతీయుల కోసం బ్యాంకాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయం బీ1/బీ2 వీసా అపాయింట్‌మెంట్‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది’’ అని భారత అమెరికా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
భారత్‌లో అమెరికా వీసా జారీలో నెలకొన్న ఆలస్యాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతోపాటు భారత్‌లోని దిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో సిబ్బందిని పెంచడంతోపాటు, శనివారం రోజున ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఇటీవలే సుమారు 2,50,000 బీ1/బీ2 వీసా అపాయింట్‌మెంట్‌లను దరఖాస్తు దారుల కోసం అందుబాటులో ఉంచింది. ‘‘వీసా అపాయింట్‌మెంట్, జారీలో నెలకొన్న జాప్యాన్ని తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం. దీంతోపాటు అదనంగా విదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలకు సిబ్బందిని పంపి అక్కడి భారతీయులకు వీసా అపాయింట్‌మెంట్‌లు ఇచ్చేలాగా చర్యలు చేపడుతున్నాం’’ అని అమెరికా కాన్సులేట్‌లోని అధికారి ఒకరు తెలిపారు. గతేడాది అక్టోబరులో బీ1/బీ2 వీసా అపాయింట్‌మెంట్ గడువు దాదాపు 1000 రోజులు ఉండటంతో భారత్‌లోని అమెరికన్ రాయబార కార్యాలయం ఈ ఏర్పాటు చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Rahul Gandhi : నేడో, రేపో ‘రాహుల్ పిటిషన్’!
-
India News
Punjab: గుర్రాల పెంపకంతో భలే ఆదాయం
-
India News
Digital Water Meters: అపార్ట్మెంట్లలో డిజిటల్ వాటర్ మీటర్లు
-
Ap-top-news News
Covid Tests: శంషాబాద్ విమానాశ్రయంలో మళ్లీ కరోనా పరీక్షలు
-
Politics News
అన్న రాజమోహన్‌రెడ్డి ఎదుగుదలకు కృషిచేస్తే.. ప్రస్తుతం నాపై రాజకీయం చేస్తున్నారు!
-
Ap-top-news News
Toll Charges: టోల్ రుసుముల పెంపు అమలులోకి..