TANA Foundation: తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఫౌండేషన్‌ చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి ఎన్నికయ్యారు.

Published : 03 Mar 2024 17:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA)లో ముఖ్య విభాగమైన ఫౌండేషన్‌కు కొత్త కార్యవర్గం ఎన్నికైంది. ఫౌండేషన్‌ చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి నియమితులయ్యారు. కార్యదర్శిగా విద్యాధర్‌ గారపాటి, కోశాధికారిగా వినయ్‌ మద్దినేని, సంయుక్త కోశాధికారిగా కిరణ్‌ గోగినేని ఎన్నికయ్యారు. తానా ఫౌండేషన్ చేయూత కార్యక్రమం కోఆర్డినేటర్‌గా సేవలందించిన శశికాంత్‌.. గతంలో షౌండేషన్‌ కోశాధికారి, కార్యదర్శి, బోస్టన్ తెలుగు అసోసియేషన్ బోర్డు ఛైర్మన్‌గానూ పనిచేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని