సందడిగా ఆంధ్ర కళావేదిక ‘కార్తీక మాస వనభోజనాలు’

కార్తీక మాసం సందర్భంగా ఖతార్‌లోని ఆంధ్ర కళావేదిక ఆధ్వర్యంలో తెలుగు వారందరి కోసం నిర్వహించిన కార్తీక మాస వనభోజనాలు సందడిగా జరిగాయి. 

Published : 30 Oct 2022 18:25 IST

ఖతార్‌: కార్తీక మాసం సందర్భంగా ఖతార్‌లోని ఆంధ్ర కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాలు ఆద్యంతం సందడి కొనసాగాయి. మొసయిద్‌ ఫ్యామిలీ పార్కులో తొలిసారి నిర్వహించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఆంధ్ర కళావేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ఒక్కరోజులోనే ౩౦౦మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకుని రికార్డు సృష్టించారని తెలిపారు.  ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ బృందం చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఎండను సైతం లెక్కచేయకుండా ఈ వనభోజనాలకు దాదాపు 450మందికి పైగా చిన్నా, పెద్ద అంతా కలిసి హాజరై సందడి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసినందుకు సహకరించిన స్పాన్సర్లు, స్వచ్ఛంద సేవకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

అనంతరం ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి విక్రం సుఖవాసి మాట్లాడుతూ.. పలువురు తెలుగు ప్రముఖులు, ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) జనరల్ సెక్రటరీ కృష్ణకుమార్, ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF) నుంచి రజని మూర్తి, తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఖాజా నిజాముద్దీన్, తెలుగు బిజినెస్ అసోసియేషన్ అధ్యక్షులు లుత్ఫీ, సత్యనారాయణ మలిరెడ్డి, గొట్టిపాటి రమణ, హరీష్ రెడ్డి, తెలంగాణ గల్ఫ్ సమితి కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను పెంపొందించే ఇలాంటి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని అభినందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీల్లో (తంబోలా,టగ్ అఫ్ వార్, Treasure హంట్, "ఒక్క నిమిషం తెలుగులో మాట్లాడు") గెలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన లక్కీ డ్రాలో గెలిచిన మొదటి ముగ్గురికి బంగారు నాణేలు(2 Grams), ఉసిరి చెట్టు కొమ్మల క్రింద రుచికరమైన సంప్రదాయ విందు భోజనం, మసాలా మజ్జిగ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులు విక్రమ్ సుఖవాసి, కేటీ రావు, వీబీకే మూర్తి, శిరీషా రామ్, సాయి రమేష్, సోమరాజు, రవీంద్రలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని