‘వీధి అరుగు’ ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై శకపురుషుని శత వసంతాలు

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు శతజయంతిని పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీన అంతర్జాతీయ వేదికగా వీధి అరుగు(నార్వే)ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు వెంకట్‌ తరిగోపుల తెలిపారు.

Updated : 23 May 2023 02:52 IST

నార్వే: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు శతజయంతిని పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీన అంతర్జాతీయ వేదికగా ‘వీధి అరుగు’(నార్వే)ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు వెంకట్‌ తరిగోపుల తెలిపారు. ప్రపంచంలోని 40 దేశాలలోని 100 పైగా తెలుగు సంఘాల భాగస్వామ్యంతో ‘శకపురుషుని శతవసంతాలు’ పేరిట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 వరకు 14 గంటలపాటు నిర్విరామంగా, అంతర్జాల వేదికపై జరిగే ఈ అపురూపమైన కార్యక్రమాన్ని వీక్షించవచ్చని వెంకట్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆత్మీయ అతిథిగా దగ్గుబాటి పురంధేశ్వరి, విశిష్ట అతిథులుగా లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ, నిర్మాత, నటుడు మురళీ మోహన్‌, నిర్మాత చలసాని అశ్వినీదత్‌, కథానాయకుడు నారా రోహిత్‌ పాల్గొననున్నారు. కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని https://www.youtube.com/watch?v=egLQZjdjyEE లింక్‌ ద్వారా వీక్షించి విజయవంతం చేయాలని ఆయన కోరారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని