నాట్స్‌ ఆధ్వర్యంలో మహిళా క్రికెట్ టోర్నమెంట్.. హోరాహోరీగా ఫైనల్‌

 ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో తెలుగు మహిళలు పోటీ పడి అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించారు. ఆరు జట్లు పాల్గొనగా ఫైనల్ మ్యాచ్‌లో టోరెన్స్ టోర్నాడోస్ జట్టు విజయం సాధించింది. 

Published : 06 Feb 2023 23:27 IST

అద్భుతంగా ఆడిన తెలుగు మహిళా క్రికెటర్లు

లాస్ ఏంజిల్స్: అమెరికాలో తెలుగుజాతిని ఒక్కటి చేసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా లాస్ ఏంజిల్స్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్‌లో తెలుగు మహిళలు పోటీ పడి అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించారు. క్రికెట్‌లో తెలుగు మహిళలకు తిరుగులేదనిపించేలా టోర్నమెంట్ సాగింది. మొత్తం ఆరు మహిళా జట్లు ఈ టోర్నమెంట్‌లో పోటీ పడ్డాయి. ఈ ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో ఆర్కాడియా లెజెండ్స్, ఆర్కాడియా వారియర్స్, పింక్ పాంథర్స్, గ్రూప్ బిలో ఇర్విన్ దివాస్, సోకల్ సూపర్ క్వీన్స్, టోరెన్స్ టోర్నడోస్ జట్లు ఉన్నాయి. జట్లు ఒకదానితో ఒకటి రౌండ్ రాబిన్ గేమ్‌లు ఆడాయి. చివరకు పింక్ పాంథర్స్, టోరెన్స్ టోర్నడోస్ జట్లు ఫైనల్‌కు చేరాయి. ఆద్యంతం పోటాపోటీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టోరెన్స్ టోర్నాడోస్ జట్టు విజయం సాధించింది. 

గత నాలుగు వారాలుగా ప్రాక్టీస్ చేసి రంగంలోకి దిగిన తెలుగు మహిళలు క్రీడా స్ఫూర్తితో అత్యుత్తమ ప్రదర్శన చేయడం అందరిని ఆకట్టుకుంది. ఈ టోర్నమెంట్ నిర్వహించడంలో చాలా మంది వాలంటీర్లు, చాప్టర్ నాయకులు కృషి చేశారు, ఎల్‌ఏ చాప్టర్ కోఆర్డినేటర్ మనోహర మద్దినేని, జాయింట్ కోఆర్డినేటర్ మురళీ ముద్దెన, స్పోర్ట్స్ ఛైర్ కిరణ్ ఇమ్మడిశెట్టి, మహిళా సాధికారత ఛైర్ రాధా తెలగం, ఈవెంట్ కోఆర్డినేషన్ ఛైర్ బిందు శివకామిశెట్టి, హెల్ప్ లైన్ ఛైర్ శంకర్ సింగం సెట్టి, కమ్యూనిటీ సర్వీసెస్ ఛైర్ అరుణ బోయినేని, రిజిస్ట్రేషన్ మెంబర్‌షిప్ ఛైర్ చంద్ర మోహన్ కుంటుమల్ల, వాలంటీర్లు, తిరుమలేష్ కొర్రంపల్లి, నీలెందు హల్దార్, పరిశీల్, హరి కలవకూరి, వంశీమోహన్ గరికపాటి, నరసింహారావు రవిలిశెట్టి, శ్రీకాంత్ చెరువుతో పాటు పలువురు మహిళా వాలంటీర్లు, చాప్టర్ టీమ్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బోర్డ్ ఆఫ్ డైరక్టర్ మధు బోడపాటి, స్పోర్ట్స్ నేషనల్ కోఆర్డినేటర్ దిలీప్ సూరపనేని, వెంకట్ ఆలపాటి, హరి కొంక, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మహిళా క్రికెట్ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన లాస్ ఏంజిల్స్ టీంకు నాట్స్ ఛైర్ విమెన్ అరుణగంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు)నూతి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు