డల్లాస్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలు

ఉమెన్స్‌ ఎమ్‌పవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్ (WETA) ఆధ్వర్యంలో మార్చి 12న అమెరికాలోని డల్లాస్‌లో  అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Published : 14 Mar 2023 23:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఉమెన్స్‌ ఎమ్‌పవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్’ (WETA) ఆధ్వర్యంలో మార్చి 12న అమెరికాలోని డల్లాస్‌లో అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రుచి ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకల్లో సుమారు ఆరు వందలకు పైగా తెలుగు మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.  

వేడుకలకు ముఖ్య అతిథిగా కారోల్టన్ డిప్యూటీ మేయర్ నాన్సీ క్లైన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి మహిళలు చేస్తున్న సేవలను కొనియాడారు. ఉమెన్స్‌ ఎమ్‌పవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్ (WETA) వ్యవస్థాపకురాలు ఝాన్సీ మాట్లాడుతూ..  మహిళలను గౌరవంగా చూసే చోట దేవతలు ఉంటారని అందుకే స్త్రీలను చిన్నచూపు చూడవద్దని కోరారు. తమ సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా అభ్యున్నతికి  WETA ఆధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను గురించి తెలిపారు. WETA అధ్యక్షురాలు శైలజ రెడ్డి మాట్లాడుతూ.. అందరూ కలిసి కట్టుగా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తే మరెంతో మంది మహిళలకు సేవ చేసే అవకాశం ఉందన్నారు. డాక్టర్‌ సుమనా గంగి  మాట్లాడుతూ..  మహిళలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. కార్యక్రమంలో సంధ్య గవ్వ, శ్రీనివాస్ కవిత ఆకుల, సుమన గంగి, స్వాతి నేలభట్ల, నాగిని కొండేల, డాక్టర్‌ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రసంగించారు.

వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళల ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు తెలుగు ప్రవాస మహిళలను ఉత్తేజపరిచాయి. యాంకర్ మధు నెక్కంటి, మెహర్ చంటి సంగీత విభావరితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మహిళలు సంప్రదాయ వస్త్రాలతో చేసిన ఫ్యాషన్ షో ఈ కార్యక్రమానికి హైలైట్‌గా నిలిచింది. ఈ కార్యక్రమంలో డల్లాస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నవ్య స్మృతి, ప్రతిమారెడ్డి, కోర్ టీమ్ అనురాధ, హైమ అనుమాండ్ల, జయశ్రీ తేలుకుంట్ల, ప్రత్యూష నర్రపరాజు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, వాలంటీర్లకు ఝాన్సీ కృతజ్ఞతలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని