NRI news: నిక్కీ హేలీని కలిసిన వైవీబీ రాజేంద్రప్రసాద్‌ బృందం

అమెరికన్‌ రిపబ్లిక్‌ పార్టీకి చెందిన అగ్రశ్రేణి నాయకురాలు నిక్కీ హేలీని తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ ఆధ్వర్యంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.

Published : 06 Nov 2022 23:30 IST

ఫ్లోరిడా: అమెరికన్‌ రిపబ్లిక్‌ పార్టీకి చెందిన అగ్రశ్రేణి నాయకురాలు నిక్కీ హేలీని తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ ఆధ్వర్యంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్, నాట్స్ మాజీ అధ్యక్షులు గుత్తికొండ శ్రీనివాసరావు, పిన్నమనేని ప్రశాంత్, ఎన్నారై తెదేపా నాయకులు శ్రీనాథ్‌రావు ఫ్లోరిడాలో మర్యాదపూర్వకంగా కలిశారు. 39 ఏళ్ల వయస్సులోనే అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా నిక్కీ హేలీ గతంలో ఎన్నికయ్యారు. అనంతరం ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగానూ పని చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నారా చంద్రబాబు నాయకత్వంలోని తెదేపా తరఫున రాజేంద్రప్రసాద్‌ రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారంటూ ఆయన్ను నిక్కీ హేలీకి తోటకూర ప్రసాద్‌ పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ నిక్కీ హేలీతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఆమె అమెరికా ఉపాధ్యక్షురాలిగా విజయం సాధించాలని ఆకాంక్షించారు. నిక్కీ హేలీ తల్లిదండ్రులు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు కావడం, అమెరికా రాజకీయాల్లో ఆమె క్రియాశీల పాత్ర పోషించడం భారతీయులందరికీ గర్వకారణమని ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు