ఇంత అమానుషమా? యోగి సారీ చెప్పాలి

యూపీలోని హాథ్రస్‌ ఘటనలో బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్‌ గాంధీపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని డీఎంకే అధినేత ........

Published : 02 Oct 2020 00:51 IST

చెన్నై: యూపీలోని హాథ్రస్‌ ఘటనలో బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్‌ గాంధీపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని డీఎంకే అధినేత స్టాలిన్‌ అన్నారు. ఈ వ్యవహారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితులు చూస్తుంటే యూపీలో అరాచకమే తప్ప చట్టబద్ధమైన పాలన సాగుతున్నట్టు కనబడటంలేదని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఆపడానికి బదులుగా యూపీ పోలీసులు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, ప్రియాంకను అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. రాహుల్‌పై దారుణంగా వ్యవహరించారని, ఆయన్ను కిందకు నెట్టేశారన్నారు. ఇంత అమానుషంగా వ్యవహరించడం తీవ్ర గర్హనీయమన్నారు. ఒక ఎంపీ, జాతీయ పార్టీ నాయకుడి పట్లే ఇలా వ్యవహరిస్తే యూపీలో ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని స్టాలిన్‌ ప్రశ్నించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని