కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక అప్పుడేనా?

కాంగ్రెస్‌ పార్టీ తదుపరి అధ్యక్షుని ఎన్నుకొనేందుకు జనవరి 2021లో ఏఐసీసీ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిసింది.

Published : 26 Aug 2020 17:46 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు జనవరి 2021లో ఏఐసీసీ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిసింది. సోమవారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఒక సంవత్సరం తర్వాత అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని కొందరు నేతలు ప్రతిపాదించగా.. రాహుల్‌ గాంధీ తదితరులు ఆరునెలల్లోనే ఈ కార్యక్రమం జరగాలని సూచించారు. కాగా, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల అనంతరం సమీపంలో ముఖ్యమైన ఎన్నికలేవీ లేనందున పార్టీ అధ్యక్ష ఎన్నికకు వచ్చే జనవరి అనుకూలమని నిర్ణయించారు.

పార్టీ అధ్యక్షురాలిగా ఆగస్టు 2019 నుంచి కొనసాగుతున్న సోనియా.. తనను ఆ పదవి నుంచి తప్పించాలని కోరిన సంగతి తెలిసిందే. దీనితో ఈ అంశాన్ని చర్చించేందుకు ఆ పార్టీ వర్కింగ్‌ కమిటీ సోమవారం సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడిగా వేరే ఎవరినైనా నియమించాలని సోనియా ఈ సమావేశంలో కోరారు. అయితే కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలిగా మరికొంత కాలం సోనియా గాంధీయే కొనసాగాలంటూ... సుదీర్ఘ చర్చల అనంతరం సీడబ్ల్యూసీ నిర్ణయించింది. ఆనారోగ్యం తదితర అనివార్య కారణాలు ఎదురైతే ఆ బాధ్యత రాహుల్‌ గాంధీకి అప్పగించాలని పలువురు పార్టీ నేతలు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని