
Updated : 12 Jun 2021 14:44 IST
TS News: ఈటల రాజీనామాకు ఆమోదం
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన శాసనసభ సభ్యత్వానికి ఈరోజు ఉదయం రాజీనామా చేశారు. ఈటల రాజీనామాను శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. ఈ ఉదయం గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఈటల అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల చేసిన రాజీనామాకు ఆమోదముద్ర వేశారు.
ఇవీ చదవండి
Tags :