Andhra News: యువజన శృంగార రసిక చిలిపి పార్టీ: బుద్దా వెంకన్న

వైకాపా పేరును ‘యువజన శృంగార రసిక చిలిపి పార్టీ’గా ఎంపీ గోరంట్ల మాధవ్‌ సార్థకం చేశారని తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ‘అవంతి అరగంట

Updated : 06 Aug 2022 07:24 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా పేరును ‘యువజన శృంగార రసిక చిలిపి పార్టీ’గా ఎంపీ గోరంట్ల మాధవ్‌ సార్థకం చేశారని తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ‘అవంతి అరగంట సరసం, అంబటి గంట విహారం ఆడియోలు బయటకొస్తే వారిపై జగన్‌రెడ్డి ఏం చర్యలు తీసుకోలేదు. ఇలాంటివి చేస్తేనే అధినేత గుర్తిస్తున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియోను బయటకు వదిలారు’ అని పేర్కొన్నారు.

పదవిచ్చినా ఆశ్చర్యం లేదు: బీటెక్‌ రవి
‘గోరంట్ల మాధవ్‌ లీలలు మెచ్చి జగన్‌ కేంద్ర మంత్రి పదవిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మహిళలపై దాడి చేస్తే పదోన్నతిస్తున్న జగన్‌రెడ్డి తీరు రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు పెరగడానికి కారణమవుతోంది’ అని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని