CM Jagan: కాంగ్రెస్‌ మా కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తోంది: జగన్‌

ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని సీఎం జగన్‌ విమర్శించారు.

Updated : 24 Jan 2024 19:27 IST

తిరుపతి: ఏపీలో కాంగ్రెస్‌ (Congress) పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని వైకాపా (YSRCP) అధినేత,  సీఎం జగన్‌ (CM Jagan) విమర్శించారు. తిరుపతిలో ఇండియాటుడే విద్యాసదస్సుకు సీఎం హాజరయ్యారు.

‘‘కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ లబ్ధికోసమే రాష్ట్రాన్ని విడదీసింది. గతంలో మా బాబాయిని మంత్రిని చేసి మాపై ప్రయోగించింది. ఇప్పుడు మళ్లీ మా కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తోంది. నా సోదరిని ఏపీ అధ్యక్షురాలిగా చేసి నాపై ప్రయోగిస్తోంది. విభజించి పాలించడమే ఆ పార్టీ నిత్య విధానం. కాంగ్రెస్‌ గతం నుంచి పాఠాలు నేర్చుకోలేదు. ఆ పార్టీకి మరోసారి దేవుడు గుణపాఠం చెబుతాడు. ఇప్పటికిప్పుడు సీఎం పదవి నుంచి దిగిపోయినా బాధపడను. వైకాపా మేనిఫెస్టోలోని 99శాతం హామీలు నెరవేర్చాం. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మా పార్టీయే గెలుస్తుంది. ఏపీ రాజకీయాల్లో జాతీయ పార్టీలకు పెద్దగా స్థానం లేదు. సర్వేల ఆధారంగానే వైకాపాలో టికెట్ల కేటాయింపు’’ అని జగన్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని