రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు

రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని కోరారు.

Published : 17 May 2024 04:09 IST

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం సమగ్ర కులగణన చేపట్టాలన్నారు. గురువారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలు ముగిసినందున ఎన్నికల కమిషన్‌ అనుమతితో కులగణన ప్రారంభించాలన్నారు. బీసీ కులగణన, స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల పెంపుపై సీఎంతో చర్చిస్తామన్నారు. సమావేశంలో బీసీ కులసంఘాల ఐకాస ఛైర్మన్‌ చిన్న శ్రీశైలం యాదవ్‌, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్‌ ముదిరాజ్‌, బీసీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరి, బీసీ జన సైన్యం రాష్ట్ర అధ్యక్షులు నగేశ్‌, సతీష్‌యాదవ్‌, శివాచారి, సంతోష్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని