రాష్ట్రపతి, ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీకి వేర్వేరుగా లేఖలు రాశారు.

Updated : 20 Nov 2020 11:56 IST

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీకి వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని కోరారు. హిందీ, ఆంగ్ల భాషల్లోనే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇతర అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.  దేశంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులకు సమాన అవకాశాలు ఇచ్చే విధంగా ప్రాంతీయభాషల్లో పరీక్షలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను కేసీఆర్‌ వివరించారు.

అలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు కూడా సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక తపాలా స్టాంప్‌నకు త్వరగా అనుమతివ్వాలని కోరారు. దక్షిణాది విడిదికి వచ్చినప్పుడు పీవీ స్మారక తపాలా స్టాంప్‌ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని