భాజపా నామినేషన్లకు ముఖ్యులు

భాజపా లోక్‌సభ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.

Published : 19 Apr 2024 04:17 IST

జాబితాలో గుజరాత్‌ సీఎం, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా లోక్‌సభ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పాల్గొంటున్నారు. అనంతరం ఖమ్మం లోక్‌సభ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు నామినేషన్‌కూ రాజ్‌నాథ్‌ హాజరవుతారు. 22వ తేదీన జహీరాబాద్‌ అభ్యర్థి బి.బి.పాటిల్‌ నామినేషన్‌ కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్రఫడణవీస్‌.. చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నల్గొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిల నామినేషన్‌ కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పీయుష్‌ గోయల్‌ పాల్గొంటారు. అదేరోజు మహబూబాబాద్‌ అభ్యర్థి సీతారాంనాయక్‌ నామినేషన్‌కు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు హాజరుకానున్నారు. 23న భువనగిరి అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ నామినేషన్‌ కార్యక్రమంలో విదేశాంగశాఖ మంత్రి ఎస్‌.జయశంకర్‌ పాల్గొంటారు. 24న పెద్దపల్లిలో గోమాసె శ్రీనివాస్‌, ఆదిలాబాద్‌లో గోడెం నగేశ్‌, వరంగల్‌ నుంచి అరూరి రమేశ్‌ నామినేషన్లు దాఖలు చేయనుండగా.. ఆ కార్యక్రమాలకు కూడా జయశంకర్‌ హాజరు కానున్నారు. అదే రోజు హైదరాబాద్‌ అభ్యర్థి కె.మాధవీలత నామినేషన్‌ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ విచ్చేయనున్నారు. ఈ నెల 25న కరీంనగర్‌లో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ నామినేషన్‌ కార్యక్రమానికి గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేందర్‌పటేల్‌ హాజరవుతారు. కొందరు అభ్యర్థుల నామినేషన్లలో కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌ కూడా పాల్గొంటారు.  నామినేషన్ల అనంతరం పూర్తిస్థాయి ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు భాజపా ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు కీలకనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తి ప్రచార షెడ్యూలు ఖరారవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని