భారాస నాయకులను చేర్చుకోవద్దు

భారాస నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దంటూ వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల పార్టీ అధ్యక్షుడు గణేశ్‌గౌడ్‌, నాయకుడు శేఖర్‌ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎదుటే పెట్రోలు పోసుకుని నిరసనకు దిగారు.

Published : 19 Apr 2024 04:36 IST

పెట్రోలు పోసుకుని ఎమ్మెల్యే ఎదుట కాంగ్రెస్‌ నాయకుల నిరసన

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే: భారాస నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దంటూ వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల పార్టీ అధ్యక్షుడు గణేశ్‌గౌడ్‌, నాయకుడు శేఖర్‌ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎదుటే పెట్రోలు పోసుకుని నిరసనకు దిగారు. గోపాల్‌పేట మండలానికి చెందిన ఇద్దరు భారాస నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నాయన్న సమాచారం తెలుసుకుని గణేశ్‌గౌడ్‌తోపాటు పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలు గురువారం వనపర్తిలో ఉన్న ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. గతంలో భారాస నాయకులు ఎన్నో కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని, వారిని పార్టీలో చేర్చుకోవద్దని కోరారు. తమ మాటలు పట్టించుకోవడం లేదని గణేశ్‌గౌడ్‌, శేఖర్‌ వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసుకుని, నిప్పుపెట్టాలని అగ్గిపెట్టెను ఎమ్మెల్యేకు ఇవ్వగా.. ఆయన తీసుకోలేదు. అక్కడే ఉన్న ఆయన సెక్యూరిటీ, పోలీసు సిబ్బంది వారిని బయటకు తీసుకెళ్లి వాహనంలో సొంత గ్రామానికి తరలించారు. గణేశ్‌గౌడ్‌ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి ప్రధాన అనుచరుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని