తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు

నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Published : 19 Apr 2024 05:54 IST

కోవూరు నామినేషన్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత

న్యూస్‌టుడే-కోవూరు: నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్లు వేసేందుకు వైకాపా, తెదేపా అభ్యర్థులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి 15 నిమిషాల తేడాలో వచ్చారు. వారి వెంట పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు.. జై జగన్‌ అంటూ నినాదాలు చేయగా, తెదేపా శ్రేణులు జై బాబు అంటూ నినదించాయి. దీంతో ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ వీరాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు లాఠీలతో కొట్టి తెదేపా శ్రేణులను చెల్లాచెదురు చేశారు.అనంతరం రోప్‌ పార్టీ వాళ్లు వైకాపా నాయకులను అక్కడి నుంచి పంపేయడంతో వివాదం సద్దుమణిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని