వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు

నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్‌రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Published : 19 Apr 2024 06:07 IST

నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్‌రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, ప్రభాకర్‌రెడ్డి పేరిట 639.26 కోట్లు ఉన్నట్లు చూపారు. అప్పులు రూ.197.29 కోట్లు ఉన్నాయి. ఆమెపై ఎలాంటి కేసులు లేవు. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.1.17 కోట్లు ఉండగా, షేర్లు, బాండ్ల రూపంలో రూ.10.62 కోట్లు ఉన్నాయి. వీరికి రూ.6.96 కోట్ల విలువైన రూ.19 కార్లున్నాయి.


దర్శి వైకాపా అభ్యర్థికి రూ.39.7 కోట్లు

దర్శి, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా దర్శి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ఆయన భార్య నందినిల స్థిర, చరాస్తుల విలువ రూ.39.71 కోట్లు. వీరికి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌, కొండాపూర్‌లో భవనాలు, చీమకుర్తి, దర్శి, తాడేపల్లిలో నివాస భవనాలు ఉన్నాయి. శివప్రసాదరెడ్డి వద్ద రూ.72 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారుతో పాటు ఇన్నోవా, భార్య వద్ద రూ.46 లక్షల విలువైన మినీ కూపర్‌ కారు ఉన్నాయి.


సుజనా చౌదరి ఆస్తులు రూ.27.93 కోట్లు

ఈనాడు, అమరావతి: విజయవాడ పశ్చిమ భాజపా అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణచౌదరి అలియాస్‌ సుజనాచౌదరి తనతోపాటు భార్య పద్మజ పేరిట 27.93 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చరాస్తులు రూ.15.27 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.12.66 కోట్లు. రూ.2.40 లక్షల అప్పు ఉంది. నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.


ప్రసన్న కుటుంబ ఆస్తులు రూ.20.57 కోట్లు

కోవూరు వైకాపా అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తన కుటుంబ స్థిర, చరాస్తులు రూ.20.57 కోట్లుగా అఫిడ్‌విట్‌లో పేర్కొన్నారు. వీరికి రూ.3.45 కోట్ల అప్పు ఉంది. ఆస్తుల్లో ప్రసన్నకుమార్‌రెడ్డి పేరిట రూ.10.65 కోట్లు, అతని భార్య పేరుపై 3.04 కోట్లు, కుమారుడి పేరుతో రూ.4.75 కోట్లు, కోడలు పేరున రూ.2.11 కోట్ల చొప్పున ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై ఎలాంటి కేసుల్లేవని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని