రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైనా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని వైకాపా తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. పాదయాత్రలో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో

Published : 02 Jul 2022 06:15 IST

వైతెపా అధ్యక్షురాలు షర్మిల విమర్శ

గరిడేపల్లి, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైనా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని వైకాపా తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. పాదయాత్రలో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో ఆమె మాట్లాడారు. తానిచ్చిన ఏ హామీనీ కేసీఆర్‌ నెరవేర్చడం లేదని ఆమె ఆరోపించారు. ప్రాజెక్టు కింద భూమి కోల్పోయిన రైతులు పరిహారం అడిగితే జైల్లో పెట్టి భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. భూములిచ్చిన వారి త్యాగం మరువలేనిదంటూనే తగిన పరిహారం ఇవ్వకుండా వాటిని గుంజుకుంటున్నారని దుయ్యబట్టారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిలబెట్టడానికే తమ పార్టీ పుట్టింద]ని షర్మిల పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని