తెదేపా హయాంలో ఒప్పందాలు చేసుకొన్న పరిశ్రమలకే జగన్‌ శంకుస్థాపన

తెదేపా హయాంలో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలకు సీఎం జగన్‌రెడ్డి శంకుస్థాపనలు చేస్తున్నారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఎద్దేవా చేశారు. జపాన్‌ టైర్ల కంపెనీ ఏటీసీని తామే రాష్ట్రానికి తెచ్చినట్లు జగన్‌,

Updated : 19 Aug 2022 06:42 IST

తెదేపా జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా హయాంలో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలకు సీఎం జగన్‌రెడ్డి శంకుస్థాపనలు చేస్తున్నారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఎద్దేవా చేశారు. జపాన్‌ టైర్ల కంపెనీ ఏటీసీని తామే రాష్ట్రానికి తెచ్చినట్లు జగన్‌, వైకాపా నాయకులు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘గతంలో చంద్రబాబు దేశ విదేశాలకు వెళ్లి అనేక కంపెనీలు, పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ఏటీసీ కంపెనీ ప్రతినిధులతో 2018లోనే ఆయన చర్చలు జరిపారు. వారికి స్థలం, పన్ను రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ కంపెనీ ఇప్పుడు ఉత్పత్తి ప్రారంభించింది. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకపోవడంతో నైపుణ్యం ఉన్న మన యువత పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇప్పటికైనా వైకాపా నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలి...’’ అని జీవీ రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని