వైకాపా కౌన్సిలర్‌ రాజీనామా

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ అధ్యక్షతన జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో 35 అంశాలకు కేవలం 3 నిమిషాల్లోనే ఆమోదం తెలపడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

Published : 01 Dec 2022 04:33 IST

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ అధ్యక్షతన జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో 35 అంశాలకు కేవలం 3 నిమిషాల్లోనే ఆమోదం తెలపడంతో విమర్శలు వెల్లువెత్తాయి. జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి వెళ్లాల్సి ఉందని, ఎజెండాను ఆమోదించాలని ఆమె కోరారు. అధికార పార్టీకి చెందిన మెజారిటీ కౌన్సిలర్లు లేచి నిలబడటంతో ఆమోదం లభించిందని ఆమె సమావేశాన్ని ముగించారు. ఈ సందర్భంగా ఎస్టీని కావడంతో తనను, తన వార్డును పట్టించుకోవడం లేదని, రెండేళ్లలో ఒక్క అభివృద్ధి పని జరగలేదంటూ అధికార పార్టీకి చెందిన 20వ వార్డు కౌన్సిలర్‌ పరుశురాం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌కు అందజేశారు. అతడిని కనీసం వారించకపోగా ‘రాజీనామా చేస్తావా.. చేయ్‌’ అని అధికార పార్టీకి చెందిన పలువురు సభ్యులే మాట్లాడటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని