పేదలకు భూమి ఎందుకు పంచడం లేదు?

నవరత్నాల గురించి చెబుతోన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం..పేదల బతుకులు మార్చే అసలైన రత్నమైన భూమిని ఎందుకు పంచడం లేదని మాజీ ఎంపీ, సీపీఐ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కారాట్‌ ప్రశ్నించారు.

Updated : 09 Dec 2022 04:58 IST

రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ ఎంపీ బృందా కారాట్‌ ప్రశ్న

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: నవరత్నాల గురించి చెబుతోన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం..పేదల బతుకులు మార్చే అసలైన రత్నమైన భూమిని ఎందుకు పంచడం లేదని మాజీ ఎంపీ, సీపీఐ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కారాట్‌ ప్రశ్నించారు. గురువారం సాయంత్రం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర మహాసభల ప్రారంభం సందర్భంగా ఆమె మాట్లాడారు. దేశంలో నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగాయి, పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల ఎంపీలందరూ మాట్లాడుతుంటే వైకాపా ఎంపీలు ఏమీ మాట్లాడలేదని ఆక్షేపించారు. కేరళలో పౌరసరఫరాల శాఖ ద్వారా 14 రకాల సరకులు పేదలకు పంపిణీ చేస్తున్నారని, ఏపీలో కూడా సరఫరా చేయాలని డిమాండు చేశారు. సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్‌, ఎమ్మెల్సీలు వెంకటేశ్వరరావు, సాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని