భాజపాలోకి ములాయం చిన్నకోడలు!

ఎన్నికల వేళ.. ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయ ఫిరాయింపులు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఎమ్మెల్యేలు భాజపాను వీడి సమాజ్‌వాదీ పార్టీలోకి చేరారు. ఇప్పుడు భాజపా కూడా అదే వ్యూహంతో ముందుకు వెళుతోంది. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్నకోడలు అర్పనా యాదవ్‌కు గాలం వేస్తోంది!.

Updated : 17 Jan 2022 06:23 IST

లఖ్‌నవూ: ఎన్నికల వేళ.. ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయ ఫిరాయింపులు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఎమ్మెల్యేలు భాజపాను వీడి సమాజ్‌వాదీ పార్టీలోకి చేరారు. ఇప్పుడు భాజపా కూడా అదే వ్యూహంతో ముందుకు వెళుతోంది. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్నకోడలు అర్పనా యాదవ్‌కు గాలం వేస్తోంది!. ఇటీవలి కాలంలో ఆమె భాజపాతో సఖ్యతగా ఉంటున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి గతంలో ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొనడం చర్చనీయాంశమైంది. దీనిపై అఖిలేష్‌ యాదవ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారన్న వార్తలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో లఖ్‌నవూలో ములాయం కోడలు పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం సాగుతోంది. అర్పన.. ములాయం రెండో భార్య సాధనా యాదవ్‌ కొడుకైన ప్రతీక్‌ సతీమణి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆమె చేరికపై భాజపా నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు.‘‘ఇప్పటికైతే ఈ విషయంలో మాకెలాంటి సమాచారం లేదు. ఆమె పార్టీలో చేరతానంటే స్వాగతిస్తాం’’ అని భాజపా నేత ఒకరు చెప్పారు.


సైకిలెక్కిన మూడో మంత్రి  

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మంత్రి మండలి నుంచి రాజీనామా చేసిన దారాసింగ్‌ చౌహాన్‌ ఆదివారం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరారు. ఆయనతో పాటు అప్నాదళ్‌(సోనేలాల్‌) విశ్వనాథ్‌గంజ్‌ శాసనసభ్యుడు ఆర్కే వర్మ కూడా సైకిల్‌ ఎక్కారు. దారాసింగ్‌ చేరికతో.. తాజాగా మంత్రిమండలి నుంచి తప్పుకొన్న ముగ్గురు ఓబీసీ మంత్రులూ ఎస్పీలోకి చేరినట్లైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని