విద్యుత్తు సంస్కరణలను వ్యతిరేకించాలి

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్‌ సంస్కరణలను అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కోరారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు

Published : 13 Feb 2022 04:45 IST

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్‌ సంస్కరణలను అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కోరారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తున్నా.. వాటిని అమలు చేయబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో సీపీఎం 23వ అఖిల భారత మహాసభ రాజకీయ తీర్మానం ముసాయిదాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం రాఘవులు మాట్లాడుతూ.. వామపక్ష వాదులకు సమతా కేంద్రాన్ని చూపించాలని బాబా రాందేవ్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గ్రామాల్లో దళిత, గిరిజన వాడలను బాబా రాందేవ్‌ సందర్శించి సమానత్వంపై మాట్లాడాలని హితవు పలికారు. విభజన హామీలపై త్రిసభ్య కమిటీ వేయడానికి ప్రధాని మోదీకి ఏడేళ్లు పట్టిందన్నారు. ఈ కమిటీ నియామకం కంటితుడుపు చర్యే అన్నారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని