శ్రీలంకలా మారుతున్న భారత్‌: కె.ఎ.పాల్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్పులతో మన దేశం వెనిజువెలా, శ్రీలంకలా తయారవుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌ ధ్వజమెత్తారు. దిల్లీలో శుక్రవారం...

Published : 14 May 2022 05:47 IST

ఈనాడు, దిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్పులతో మన దేశం వెనిజువెలా, శ్రీలంకలా తయారవుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌ ధ్వజమెత్తారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ రూ.50లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. శ్రీలంకలో ఒకే కుటుంబంలోని అయిదుగురి మాదిరే తెలంగాణలోనూ ఒకే కుటుంబంలోని అయిదుగురు పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన కుమారుడి కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. తనపై జరిగిన దాడికి సంబంధించి చర్యలు తీసుకుంటానని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారని పాల్‌ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితం అయిపోయిందన్నారు. రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తమ పార్టీ 178 లోక్‌సభ సీట్లు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ మినహా మిగతా సీట్లన్నీ తమకే దక్కుతాయన్నారు. 2శాతం ఓట్లు లేని పవన్‌కల్యాణ్‌ వెనుక ఎందుకు పడుతున్నారని తాను అమిత్‌ షాను ప్రశ్నించగా, ఆయనే తమ వెనుక పడుతున్నారని షా తెలిపారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని